MG Astor facelift : ఎంజీ ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. వచ్చేస్తోంది..!-mg astor suv to get facelift soon likely to get new features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Astor Facelift : ఎంజీ ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. వచ్చేస్తోంది..!

MG Astor facelift : ఎంజీ ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. వచ్చేస్తోంది..!

Sharath Chitturi HT Telugu
Jun 20, 2023 01:14 PM IST

MG Astor facelift : ఎంజి ఆస్టర్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోంది. ఇందుకు సంబంధించిన టీజర్​ను సంస్థ ఇటీవల విడుదల చేసింది.

ఎంజీ ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. వచ్చేస్తోంది..!
ఎంజీ ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. వచ్చేస్తోంది..!

MG Astor SUV facelift : ఎంజీ మోటార్​ సంస్థకు ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటైన ఆస్టర్​ ఎస్​యూవీకి.. ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోంది. ఈ వార్త గత కొంతకాలంగా సోషల్​ మీడియా చక్కర్లు కొడుతుండగా.. తాజాగా దీనిని ఈ బ్రిటీష్​ ఆటోమొబైల్​ సంస్థ కన్ఫర్మ్​ చేసింది.

ఎంజీ ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​..

2021లో ఎంజీ ఆస్టర్​ను ఇండియాలోకి తీసుకొచ్చింది ఈ సంస్థ. ఇండియాలో ఏడీఏఎస్​ ఫీచర్​ లభించిన తొలి వాహనంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2023 ఎంజీ ఆస్టర్​ ఎస్​యూవీకి సంబంధించిన టీజర్​ను సంస్థ ఇటీవలే విడుదల చేసింది. ఇందులో ఎక్స్​టీరియర్​ డిజైన్​కు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇది పాత వర్షెన్​నే పోలి ఉంది. పెద్దగా మార్పులేవీ కనిపించడం లేదు. నివేదికల ప్రకారం.. ఆస్టర్​ ఎస్​యూవీ ఫేస్​లిఫ్ట్​లో భారీ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​తో పాటు కొత్త సాఫ్ట్​వేర్​ గ్రాఫిక్స్​ వస్తాయి. టెక్నాలజీతో పాటు లగ్జరీ కూడా వస్తుందని ఎంజీ మోటార్​ సంస్థచెబుతోంది.

ఎంజీ ఆస్టర్​ ఎస్​యూవీలో ప్రస్తుతం ఉన్న 10 ఇంచ్​ బదులుగా.. 14 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెక్టార్​ ఎఫ్​లిఫ్ట్​లో ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది. హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ మోడల్​ నుంచి మరికొన్ని ఫీచర్స్​ను ఆస్టర్​లో యాడ్​ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటెలిజెంట్​ టర్న్​ ఇండికేటర్లు, ఆటో కార్​ లాక్​/ అన్​లాక్​, పవర్డ్​ టెయిల్​గేట్​, 8 కలర్​ యాంబియెంట్​ లైటింగ్​ విత్​ వాయిస్​ కామాండ్స్​ వంటివి యాడ్​ అవ్వొచ్చు.

ఇదీ చూడండి:- Hyundai i20 facelift : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ హైలైట్స్​ ఇవే..

ఇక ఇంజిన్​ విషయానికొస్తే.. ఎంజీ ఆస్టర్​లో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​, 1.3 లీటర్​ టర్పో పెట్రోల్​ ఇంజిన్​లో కొనసాగవచ్చు. ఇవి.. 108 బీహెచ్​పీ పవర్​ను- 144 ఎన్​ఎం టార్క్​ను, 138 బీహెచ్​పీ పవర్​ను, 220ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తాయి.

ప్రస్తుతం.. ఇండియా మార్కెట్​లో ఎంజీ ఆస్టర్​ ప్రారంభం ఎక్స్​షోరూం ధర రూ. 10.81లక్షలుగా ఉంది. టాప్​ ఎండ్​ వేరియంట్​ ధర రూ. 17లక్షలుగా ఉంది.

ఈ కొత్త ఎస్​యూవీ వర్షెన్​ లాంచ్​, ధర వంటి వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు.

కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​..

మరోవైపు.. ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ కియా మోటార్స్​ సైతం.. సెల్టోస్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను తీసుకురాబోతోంది. వచ్చ నెల 4న.. 2023 కియా సెల్టోస్​ను రివీల్​ చేయనుంది. కొరియాలో లాంచ్​ అయిన సరిగ్గా ఏడాది కాలానికి.. ఈ 2023 కియా సెల్టోస్​ను ఇండియాలో రివీల్​ చేస్తోంది ఆ సంస్థ. ఇక కియా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న ఈ ఎస్​యూవీ లేటెస్ట్​ వర్షెన్​.. ఈ ఏడాది ఆగస్ట్​లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం