Kia Seltos facelift : జులై 4న సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ను రివీల్​ చేయనున్న కియా..-kia seltos facelift to be unveiled on july 4 heres whats expected ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Seltos Facelift : జులై 4న సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ను రివీల్​ చేయనున్న కియా..

Kia Seltos facelift : జులై 4న సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ను రివీల్​ చేయనున్న కియా..

Sharath Chitturi HT Telugu
Jun 20, 2023 09:16 AM IST

Kia Seltos facelift launch : కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను జులై 4న రివీల్​ చేయనుంది సంస్థ. బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

జులై 4న సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ను రివీల్​ చేయనున్న కియా..
జులై 4న సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ను రివీల్​ చేయనున్న కియా..

Kia Seltos facelift launch : ఇండియా మార్కెట్​లో.. కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఎప్పుడు లాంచ్​ అవుతుందా? అని ఎదురుచూస్తున్న వారికి గుడ్​ న్యూస్​! వచ్చే నెల 4న.. సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ను అధికారికంగా రివీల్​ చేయనుంది కియా మోటార్స్​ ఇండియా. కొరియాలో లాంచ్​ అయిన సరిగ్గా ఏడాది కాలానికి.. ఈ 2023 కియా సెల్టోస్​ను ఇండియాలో రివీల్​ చేస్తోంది ఆ సంస్థ. ఇక కియా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న ఈ ఎస్​యూవీ లేటెస్ట్​ వర్షెన్​.. ఈ ఏడాది ఆగస్ట్​లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మోడల్​ బుకింగ్స్​ను సంస్థ ప్రారంభించింది. రూ. 25వేల రీఫండెబుల్​ టోకెన్​ అమౌంట్​తో సంస్థకు చెందిన డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ ఎస్​యూవీని బుక్​ చేసుకోవచ్చు. 

కియా సెల్టోస్​ ఎస్​యూవీకి డిమాండ్​ ఎక్కువే..

2019లో సెల్టోస్​ ఎస్​యూవీని లాంచ్​ చేసింది కియా. అప్పటి నుంచి సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతోంది. ఇటీవలే.. 5లక్షల సేల్స్​ మార్క్​ను సైతం అందుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఇండియాలో సంస్థ సేల్స్​లో సెల్టోస్​ వాటా 55శాతం ఉందంటే.. ఈ మోడల్​కు ఏ రేంజ్​లో డిమాండ్​ ఉందొ అర్థం చేసుకోవచ్చు.

ఇక 2023 కియా సెల్టోస్​ లుక్​ మరింత బోల్డ్​గా మారింది. ఇందులో స్కల్ప్​టెడ్​ బానెట్​, క్రోమ్​ సరౌండెడ్​ టైగర్​ నోస్​ గ్రిల్​, ఇంటిగ్రేడెట్​ డీఆర్​ఎల్స్​తో కూడిన స్లీక్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, రివైజ్డ్​ బంపర్స్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​, రూఫ్​ రెయిల్స్​, ఓఆర్​వీఎంలు, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, డిజైనర్​ డ్యూయెల్​- టోన్​ అలాయ్​ వీల్స్​ వంటి ప్రీమియం ఫీచర్స్​ ఉన్నాయి.

ఇక రేర్​లో రూఫ్​ మౌంటెడ్​ స్పాయిలర్​, వ్రాప్​ అరౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, షార్క్​ ఫిన్​ యాంటీనాలు వస్తున్నాయి.

ఇంటీరియర్​లో మార్పులు ఇలా..!

ఎస్​యూవీలోని 5 సీటర్​ కేబిన్​.. స్పెషియస్​గా ఉంటుంది. ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీ, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, డ్యూయెల్​ 10.25 ఇంచ్​ స్క్రీన్​ సెటప్​ వంటివి వస్తున్నాయి. సెంట్రల్​ ఏసీ వెంట్స్​.. ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ కింద వస్తాయి. హెచ్​వీఏసీ కంట్రోల్స్​ లుక్​ కూడా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టాప్​ ఎండ్​ వేరియంట్​లో కూడా లేని పానోరమిక్​ సన్​రూఫ్​ను ఈసారి తీసుకోస్తోంది సంస్థ.

6 ఎయిర్​బ్యాగ్స్​, ఏడీఏఎస్​ టెక్నాలజీతో పాటు హిల్​ అసిస్ట్​ కంట్రోల్​, వెహికిల్​ స్టెబులిటీ మేనేజ్​మెంట్​ వంటి ఫీచర్స్​ ఇందులో ఉండొచ్చు.

ఇంజిన్​ వివరాలు ఇలా..

త్వరలో లాంచ్​కానున్న 2023 కియా సెల్టోస్​ ఎస్​యూవీలో సరికొత్త 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​, 1.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​, 1.5 లీటర్​ సీఆర్​డీఐ డీజిల్​ ఇంజిన్​ ఉండే అవకాశం ఉంది. ఇవి.. 160 హెచ్​పీ పవర్​- 253 ఎన్​ఎం టార్క్​, 113.4 హెచ్​పీ పవర్​- 244 ఎన్​ఎం టార్క్​, 113.4 హెచ్​పీ పవర్​- 250 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తాయి.

ఇక ఈ మోడల్​ సంబంధించిన ధరతో పాటు ఇతర వివరాలు లాంచ్​ సమయంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ ప్రీమియం కారు ఎక్స్​షోరూం ధర రూ. 10.89లక్షలు- రూ. 19.65లక్షల మధ్యలో ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

ఇక లాంచ్​ అనంతర 2023 కియా సెల్టోస్​.. హ్యుందాయ్​ క్రేటా, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, హ్యుందాయ్​ అల్కజార్​, వెన్యూకు గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం