JioTV+ 2 in 1 offer: ఒకే కనెక్షన్ తో రెండు టీవీల్లో జియో ప్లస్ కంటెంట్; ‘జియో టీవీ ప్లస్ టూ-ఇన్-వన్’ ఆఫర్-jiotv plus 2 in 1 offer connects 2 tvs with 1 jioairfiber connection ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jiotv+ 2 In 1 Offer: ఒకే కనెక్షన్ తో రెండు టీవీల్లో జియో ప్లస్ కంటెంట్; ‘జియో టీవీ ప్లస్ టూ-ఇన్-వన్’ ఆఫర్

JioTV+ 2 in 1 offer: ఒకే కనెక్షన్ తో రెండు టీవీల్లో జియో ప్లస్ కంటెంట్; ‘జియో టీవీ ప్లస్ టూ-ఇన్-వన్’ ఆఫర్

HT Telugu Desk HT Telugu
Aug 20, 2024 09:02 PM IST

JioTV+ 2 in 1 offer: రిలయన్స్ జియో నుంచి మరో అద్భుతమైన ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ ద్వారా ఒకే కనెక్షన్ తో రెండు టీవీల్లో జీయో టీవీ ప్లస్ సేవలను పొందవచ్చు. అంటే, ఒక కనెక్షన్ తో రెండు టీవీల్లో 800+ ఛానెల్‌లు, 13 ఓటీటీ యాప్‌లను వీక్షించవచ్చు. పూర్తి వివరాల కోసం కింది కథనం చదవండి..

ఒకే కనెక్షన్ తో రెండు టీవీల్లో జియో ప్లస్ కంటెంట్
ఒకే కనెక్షన్ తో రెండు టీవీల్లో జియో ప్లస్ కంటెంట్ (REUTERS)

JioTV+ 2 in 1 offer: రిలయన్స్ జియో సరికొత్తగా "జియో టివి ప్లస్ టూ-ఇన్-వన్" ఆఫర్‌ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఈ వినూత్న ఆఫర్ ద్వారా కస్టమర్‌లు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ని ఉపయోగించి ఒకేసారి రెండు టెలివిజన్‌లను రన్ చేసుకొనేందుకు వీలు అవుతుంది. ఈ ప్లాన్‌తో, జియో టీవీ ప్లస్ యాప్ ద్వారా సబ్‌స్క్రైబర్‌లు, 800కి పైగా డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 13 ప్రముఖ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ పొందుతారు.

13 ప్రముఖ ఓటీటీ యాప్‌ లు..

JioTV+ యాప్ అనేక రకాల కంటెంట్‌ను అందిస్తుంది. 10 భాషల్లో, 20 కేటగిరీల్లో 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లను అందిస్తోంది. ఈ విస్తృతమైన ఛానెల్ లైనప్‌తో పాటు, వినియోగదారులు ఒకే లాగిన్ నుండి 13కి పైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లకు నిరంతారాయమైన యాక్సెస్‌ను పొందవచ్చు.

JioTV+ యొక్క ముఖ్య ఫీచర్లు:

  • ఒకే సైన్ ఇన్ తో రెండు టీవీల్లో 13 కి పైగా ఓటీటీ కంటెంట్ ను చూడవచ్చు.
  • ఓటీటీలు, చానల్స్ మధ్య నావిగేషన్ కోసం స్మార్ట్ రిమోట్ కంట్రోల్.
  • మీ ప్రాధాన్యతల ఆధారంగా, మీరు చూసే కంటెంట్ ను పరిశీలించి, మీకు నచ్చే కంటెంట్ ను సిఫారసు చేస్తుంది.
  • సులభంగా కోరుకున్న కంటెంట్ చూసేలా సెర్చ్ ఆప్షన్స్. వాయిస్ అసిస్ట్ సెర్చ్ కూడా చేయవచ్చు.
  • ప్లేబ్యాక్ వేగాన్ని సర్దుబాటు చేయడానికి, గతంలో ప్రసారమైన షోలను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

వివిధ ప్లాన్లలో..

ఈ సర్వీసులు అన్ని జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌లలో అందుబాటులో ఉంది. జియో ఫైబర్ (JioFiber) పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌ల కోసం, ఇది రూ. 599 రూ. 899 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలోఅందుబాటులో ఉంది. JioFiber ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం, ఈ సేవ రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో అందుబాటులో ఉంది. JioTV+ యాప్ ద్వారా అందించే ఛానెల్‌లు, ఓటీటీల్లో కలర్స్ టీవీ, స్టార్ ప్లస్, జీ టీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. అదనంగా, Disney+ Hotstar, SonyLIV, Zee5 వంటి అగ్ర OTT ప్లాట్‌ఫారమ్‌లు చేర్చబడ్డాయి.

ఈ సర్వీస్ ను ఇలా పొందండి..

ఈ ఆఫర్ ను పొందడానికి, మీ స్మార్ట్ టీవీ యాప్ స్టోర్ నుండి Jio TV ప్లస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి, మీ రిజిస్టర్డ్ Jio Fiber లేదా Jio Air Fiber మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి మరియు వెంటనే విస్తారమైన కంటెంట్ లైబ్రరీని ఆస్వాదించండి. ఈ ఆఫర్‌తో, Jio TV భారతదేశపు అతిపెద్ద కంటెంట్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌గా వేగంగా మారుతోంది. ఎటువంటి అదనపు ఛార్జీలు లేదా ప్రత్యేక కనెక్షన్‌ల అవసరం లేకుండా విభిన్న రకాల వినోద ఎంపికలకు నిరంతారాయమైన యాక్సెస్‌ను అందిస్తుంది.