JioBharat B1 : రూ. 1,299కే జియోభారత్ బీ1​ 4జీ మొబైల్​.. సినిమాలు చూసేయొచ్చు!-jiobharat b1 4g feature phone launched check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Jiobharat B1 4g Feature Phone Launched Check Details Here

JioBharat B1 : రూ. 1,299కే జియోభారత్ బీ1​ 4జీ మొబైల్​.. సినిమాలు చూసేయొచ్చు!

Sharath Chitturi HT Telugu
Oct 13, 2023 12:05 PM IST

JioBharat B1 : జియో నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ మొబైల్​ లాంచ్​ అయ్యింది. దీని పేరు జియోభారత్​ బీ1. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వివరాలు ఇలా ఉన్నాయి..

రూ. 1,299కే బడ్జెట్​ ఫ్రెండ్లీ జియోభారత్​ 4జీ మొబైల్​..!
రూ. 1,299కే బడ్జెట్​ ఫ్రెండ్లీ జియోభారత్​ 4జీ మొబైల్​..!

JioBharat B1 : 4జీ మొబైల్​ మార్కెట్​లోకి మరో కొత్త డివైజ్​ను లాంచ్​ చేసింది రిలయన్స్​ జియో. దీని పేరు “జియోభారత్​ బీ1 4జీ”. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

జియోభారత్​ బీ1 విశేషాలివే..

ఇటీవలి కాలంలో.. అతి చౌకైన మొబైల్స్​ను తయారు చేస్తోంది రిలయన్స్​ సంస్థ. ఇక 4జీ విభాగంలో కంపెనీకి ఇప్పటికే జియోభారత్​ వీ2, కే1 కార్బాన్​ మోడల్స్​ ఉన్నాయి. ఇక ఇప్పుడు.. జియోభారత్​ బీ1 కూడా ఎంట్రీ ఇచ్చింది.

JioBharat B1 4G price : ఈ కొత్త గ్యాడ్జెట్​లో ప్లాస్టిక్​ ఎక్స్​టీరియర్​ ఉంటుంది. 2.4 ఇంచ్​ డిస్​ప్లే లభిస్తోంది. ఇందులో సింగిల్​ క్యూవీజీఏ కెమెరా ఉంటుంది. దీనితో బేసిక్​ ఫొటోలు తీసుకోవచ్చు. ఒక స్పీకర్​ కూడా ఇందులోపల ఉంటుంది. అంటే.. వినియోగదారులు.. 4జీ కనెక్టివిటీతో, 2.4 ఇంచ్​ స్క్రీన్​తో వీడియోలు, సినిమాలు చూసుకోవచ్చు. అంతేకాకుండా.. 2000ఎంఏహెచ్​ బ్యాటరీ ఈ మొబైల్​ సొంతం.

ఈ జియోభారత్​ బీ1 4జీ మొబైల్​లో జియోసినిమా, జియోసావన్​ వంటి యాప్స్​ ఇన్​-బిల్ట్​గా వస్తుండటం విశేషం. ఫలితంగా సినిమాలు, వీడియోలు, స్పోర్ట్స్​ హైలైట్స్​తో పాటు వివిధ భాషల్లోని 8కోట్లకుపైగా పాటలను ఈ బుడ్డి ఫోన్​లో చూడవచ్చు.

JioBharat B1 4G review : అంతేకాకుండా.. ఈ మొబైల్​తో యూపీఐ పేమెంట్స్​ చేయడంతో పాటు క్యూఆర్​ కోడ్స్​ని కూడా స్కాన్​ చేసుకోవచ్చు. ఎఫ్​ఎం రేడియోకు ఇది సపోర్ట్​ చేస్తుంది. 23 దేశీయ భాషల్లో ఈ డివైజ్​ పనిచేస్తుంది.

ఈ జియోభారత్​ బీ1ని కొత్త లేదా పాత జియో సిమ్​తో వాడుకోవచ్చు. కాకపోతే.. డివైజ్​ తీసుకున్న వెంటనే రూ. 123 ప్లాన్​తో రీఛార్జ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

JioBharat B1 4G launch : సంస్థ అధికారిక వెబ్​సైట్​లో "జియోభారత్​ బీ1 సిరీస్​" కింద ఈ కొత్త మొబైల్​ లిస్ట్​ అయ్యింది. అంటే.. రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని డివైజ్​లు లాంచ్​ అవుతాయని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ మొబైల్​.. ముఖ్యంగా గ్రామాల్లోని, స్మార్ట్​ఫోన్​ వాడటం తెలియని వారికి బాగా ఉపయోగపడుతుంది.

కొత్త మొబైల్​ ధర ఎంతంటే..

ఈ జియోభారత్​ బీ1 4జీ ధర రూ. 1,2999. బ్లాక్​ కలర్​ ఆప్షన్​ ఒక్కటే ఉంది. అమెజాన్​తో పాటు జియో స్టోర్స్​లో ఈ మోడల్​ను కొనుగోలు చేసుకోవచ్చు.

ఈ జియో ప్లాన్స్​ విన్నారా..?

క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. వరల్డ్ కప్ మ్యాచ్​లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడలేకపోతున్నామని బాధపడుతున్నారా? మీ కోసమే రిలయన్స్ జియో ఈ ప్రి పెయిడ్ ప్లాన్స్​ను తీసుకువచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం