Jio plans: ఈ క్రికెట్ సీజన్ లో ఈ జియో ప్లాన్స్ తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఈ వరల్డ్ కప్ ప్రారంభంతో క్రికెట్ సీజన్ ప్రారంభమైంది. క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచులు అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అవి ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి.
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. వరల్డ్ కప్ మ్యాచ్ లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడలేకపోతున్నామని బాధ పడుతున్నారా? మీ కోసమే రిలయన్స్ జియో ఈ ప్రి పెయిడ్ ప్లాన్స్ ను తీసుకువచ్చింది.
మంత్లీ, క్వార్టర్లీ..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో జియో యూజర్లు ఇకపై వరల్డ్ కప్ మ్యాచ్ లను హెచ్ డీ క్వాలిటీతో చూడవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను కూడా అందించే పలు ప్రి పెయిడ్ ప్లాన్లను జియో ప్రారంభించింది. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఈయర్లీ వ్యాలిడిటీలతో వివిధ రేట్లలో ఈ ప్లాన్స్ జియో ప్రి పెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్స్ తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో పాటు డైలీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ తదితర సదుపాయాలున్నాయి.
రూ. 328 తో ప్రారంభం
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో వచ్చే జియో ప్రి పెయిడ్ ప్లాన్లలో కొన్ని ఇవి..
- రూ. 328 ప్లాన్. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1.5 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే, 3 నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ - మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
- రూ. 758 ప్లాన్. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1.5 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే, 3 నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ - మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
- రూ. 388 ప్లాన్. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే, 3 నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ - మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
- రూ. 808 ప్లాన్: ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే, 3 నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ - మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
- రూ. 598 ప్లాన్: ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే, 1 సంవత్సరం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ - మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
- రూ. 3178 ప్లాన్: ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే, 1 సంవత్సరం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ - మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.