ITR filing 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఫామ్ 16 గురించి ఈ విషయాలు తెలుసుకోండి-itr filing 2024 form 16 issue date to importance know it all in brief here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Itr Filing 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఫామ్ 16 గురించి ఈ విషయాలు తెలుసుకోండి

ITR filing 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఫామ్ 16 గురించి ఈ విషయాలు తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Apr 30, 2024 06:38 PM IST

ITR filing 2024: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడానికి సమయం ఆసన్నమైంది. ఐటీఆర్ ను దాఖలు చేయడానికి వేతన జీవులకు అత్యంత ముఖ్యమైనది ఫామ్ 16. ఈ ఫామ్ 16 (Form 16) గురించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఐటీఆర్ దాఖలు చేయడానికి లాస్ట్ డేట్ జులై 31
ఐటీఆర్ దాఖలు చేయడానికి లాస్ట్ డేట్ జులై 31

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ పన్నులను చెల్లించడంపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. చాలా మంది ఈ ప్రక్రియను సాధ్యమైనంత ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆలస్యం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంతిమంగా, అర్హులైన అందరూ ఆదాయ పన్ను (Income Tax) చెల్లించక తప్పదు. గడువు ముగిస్తే, జరిమానాలు పడే అవకాశం కూడా ఉంది. ఈ రోజుల్లో జరిమానాలు కూడా భారీగా ఉంటున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్ Income Tax Return ITR) ను దాఖలు చేయడానికి ఉద్యోగులకు అత్యంత అవసరమైనది ఫామ్ 16. వేతన జీవులు జూన్ నుండి 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయవచ్చు. కానీ ఫారం 16 (Form 16) అందుకున్న తర్వాత మాత్రమే ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ 2024 జూలై 31.

ఫామ్ 16 అంటే ఏమిటి?

ఫామ్ 16 అనేది ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులకు వారి యాజమాన్యం ఇచ్చే సర్టిఫికేట్. ఈ సర్టిఫికెట్ ఎవరైనా వారి ఉద్యోగం నుండి ఎంత డబ్బు సంపాదించారో, వారి యజమాని వారి జీతం నుండి ఎంత మొత్తం పన్నుగా తీసుకున్నాడో చూపిస్తుంది. ఇది యజమాని ఆదాయ పన్ను శాఖకు సరైన మొత్తంలో పన్నును పంపుతుందని నిర్ధారిస్తుంది. సరళంగా చెప్పాలంటే, ఫారం 16 (Form 16) ఒక ఆర్థిక సంవత్సరం (సాధారణంగా ఏప్రిల్ నుండి మార్చి వరకు)లో మీ ఆదాయం, పన్నులకు సంబంధించిన రిపోర్ట్ కార్డు వంటిది. ఇది యజమాని మినహాయించిన టిడిఎస్ కు రుజువుగా పనిచేస్తుంది. ఫామ్ 16 ను పార్ట్ ఏ, పార్ట్ బీ అని రెండుగా విభజించారు.

ఫామ్ 16 లో స్థూలంగా ఈ విషయాలు ఉంటాయి.

  • ఉద్యోగి పాన్ (Permanent Account Number)
  • ఎంప్లాయర్ టాన్ (ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్)
  • వేతన ఆదాయం
  • ఆదాయ పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు
  • మూలం వద్ద పన్ను కోత (TDS)
  • బ్యాంకు ద్వారా చెల్లించినట్లయితే చలానా ఐడెంటిఫికేషన్ నెంబరు

ఫామ్ 16 జారీ తేదీ ఏమిటి?

యజమానులు సాధారణంగా జూన్ 15 లేదా అంతకంటే ముందు తమ ఉద్యోగులకు ఫారం 16 ఇస్తారు.

ఫామ్ 16ఏ అంటే ఏమిటి?

ఫామ్ 16 పార్ట్ ఏ లో ప్రతి త్రైమాసికానికి మీ జీతం నుంచి తీసుకునే టీడీఎస్ కు సంబంధించిన సమాచారం ఉంటుంది.

ఫామ్ 16బీ అంటే ఏమిటి?

ఫామ్ 16 లోని పార్ట్ బీ పార్ట్ ఏకు అదనపు భాగం వంటిది. ఇందులో మీ జీతంలోని వివిధ విభాగాలు, మీరు క్లెయిమ్ చేసుకునే ఆదాయ పన్ను మినహాయింపులు ఉంటాయి. మీరు ఇప్పటికే ఎంత పన్ను చెల్లించారు? మీరు ఇంకా ఎంత పన్ను చెల్లించాలి? మీ జీతంతో పాటు మీరు సంపాదించిన ఇతర డబ్బు.. వంటి విషయాలను చూపిస్తుంది. యజమానులు తమ ఉద్యోగుల కోసం ఈ పత్రాన్ని తయారు చేస్తారు.

ఫామ్ 16 లో ఇవి జాగ్రత్తగా చెక్ చేయండి..

ఆదాయానికి టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వర్తిస్తుందా? అనే విషయాన్ని మీ ఫామ్ 16 ద్వారా తెలుస్తుంది. మొదట, మీరు మీ యజమాని నుండి ఫారం 16 అందుకున్న తర్వాత, దాని ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి అందించిన మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా సమీక్షించండి. ఇందులో మీరు సంపాదించిన ఆదాయం, చేసిన టీడీఎస్ మినహాయింపులు వంటి వివరాలు ఉంటాయి. మీ ఆదాయ గణాంకాలు, పన్ను మినహాయింపు (Tax deductions) మొత్తం వంటి ఫారం 16 లోని ప్రతి వివరాలను క్షుణ్ణంగా ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అలాగే, మీ ఫామ్ 16 (Form 16) లో ఏవైనా తప్పులు లేదా వ్యత్యాసాలు కనిపిస్తే, వీలైనంత త్వరగా మీ సంస్థ హెచ్ఆర్ ను సంప్రదించి, తగిన మార్పులు చేయమని కోరండి. సవరించిన టీడీఎస్ రిటర్న్ ప్రాసెస్ చేసిన తర్వాత, కంపెనీ ఉద్యోగికి సరి చేసిన ఫామ్ 16 ను జారీ చేస్తుంది.

ఫామ్ 16 ప్రాముఖ్యత

  • ఇది ఒక ఉద్యోగి ఆర్థిక సంవత్సరం అంతటా సంపాదించిన ఆదాయానికి ఖచ్చితమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. వారి సంపాదన యొక్క స్పష్టమైన రికార్డును అందిస్తుంది.
  • ఫామ్ 16 ఉద్యోగి తరఫున యజమాని మూలం వద్ద మినహాయించిన పన్ను (TDS)కు రుజువుగా పనిచేస్తుంది.
  • ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటిఆర్) ఖచ్చితంగా దాఖలు చేయడానికి అవసరమైన సమగ్ర వివరాలను ఫారం 16 కలిగి ఉంటుంది. వేతన ఆదాయం, అర్హత తగ్గింపులు మరియు మినహాయించబడిన టీడీఎస్ మొత్తం వంటి ముఖ్యమైన సమాచారం ఇందులో ఉంటుంది. ఇది ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూస్తుంది.
  • వేతన ఉద్యోగులకు, పన్ను రిఫండ్లను (tax refunds) క్లెయిమ్ చేయడంలో ఫారం 16 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వారి ఆదాయం మరియు మినహాయించిన పన్నుల గురించి వివరణాత్మక ఇన్ సైట్స్ ను అందిస్తుంది. అలాగే, మీకు చెల్లించాల్సిన రిఫండ్లను క్లెయిమ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

Whats_app_banner