Mahila Samman Certificate: ‘‘మహిళా సమ్మాన్ సర్టిఫికెట్ వడ్డీపై టీడీఎస్ ఉండదు’’
Mahila Samman Certificate: మహిళా సమ్మాన్ సర్టిఫికెట్ (Mahila Samman Certificate) ప్రొగ్రామ్ లో మహిళలకు ఇచ్చే వడ్డీపై టీడీఎస్ (TDS) వర్తించదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (CBDT) స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా వారు ఏ టాక్స్ బ్రాకెట్ లోకి వస్తారో ఆ పన్ను శాతం వర్తిస్తుందని తెలిపింది.
Mahila Samman Certificate: 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఈ మహిళా సమ్మాన్ సర్టిఫికెట్ Mahila Samman Saving Certificate MSSC) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళలకు 7.5% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో మహిళలు రెండు సంవత్సరాల గడువుతో రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
Mahila Samman Certificate: వడ్డీపై పన్ను
ఈ నేపథ్యంలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (Mahila Samman Saving Certificate MSSC) డిపాజిట్ల పై లభించే వడ్డీకి సంబంధించి సీబీడీటీ ఒక వివరణ ఇచ్చింది. మహిళా సమ్మాన్ సర్టిఫికెట్ (Mahila Samman Certificate) డిపాజిట్లపై మహిళలకు ఇచ్చే వడ్డీపై టీడీఎస్ (TDS) వర్తించదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (CBDT) స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా వారు ఏ టాక్స్ బ్రాకెట్ లోకి వస్తారో ఆ పన్ను శాతం మాత్రం వర్తిస్తుందని తెలిపింది. అలాగే, ఈ Mahila Samman Saving Certificate పథకంలో భాగంగా పొందే వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 40 వేలకు మించనట్లైతే, ఆ వడ్డీపై టీడీఎస్ (TDS) ఉండదని స్పష్టం చేసింది. 7.5% వడ్డీ రేటుతో ఒక సంవత్సరంలో రూ. 2 లక్షల డిపాజిట్ కు రూ. 15 వేలు, రెండేళ్లకు రూ. 30వేలు వడ్డీగా లభిస్తుంది. అది రూ. 40 వేల కన్నా తక్కువే కనుక ఆ వడ్డీ మొత్తంపై టీడీఎస్ ఉండదు. ఆకర్షణీయమైన వడ్డీ రేటు ఇస్తున్న ఈ Mahila Samman Saving Certificate డిపాజిట్ పథకం మహిళలకు అన్ని విధాలుగా ఉపయోగకరమని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నారు.