iPhone SE 4 Launch : ఐఫోన్ 16తోపాటు ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ చేసే అవకాశం.. అంటే వచ్చేది ఈ ఏడాదే అన్నమాట!
iPhone SE 4 Launch Date : చాలా రోజులుగా ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ మీద వార్తలు వస్తున్నాయి. 2025 మార్చిలో లాంచ్ జరగనుందని ప్రచారం జరిగింది. అయితే 2024 ఆపిల్ ఈవెంట్లో ఐఫోన్ 16తో పాటు ఐఫోన్ ఎస్ఈ 4ను కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ టైమ్ గురించి గత రెండు వారాలుగా వార్తలు వస్తున్నాయి. ఆపిల్ ఈవెంట్ 2024లో ఐఫోన్ 16 లాంచ్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ఈ ఈవెంట్ సమీపిస్తున్న కొద్దీ.. ఆపిల్ మిడ్-రేంజ్ ఐఫోన్ ఎస్ఈ4 చుట్టూ కొత్త పుకార్లు ఆన్‌లైన్‌లో వస్తున్నాయి. ఆపిల్ గ్లోటైమ్ 2024 ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అనే నాలుగు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయనుంది.
అయితే ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్ 2024లో ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆపిల్ చివరిసారిగా 2022లో ఐఫోన్ ఎస్ఈ మోడల్‌ను లాంచ్ చేసింది. చాలా మంది విశ్లేషకులు ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ 2025 మార్చిలో ఉంటుందని భావించారు. కానీ ముందుగానే తీసుకొచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోందని మరికొందరు అంటున్నారు. ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ అనేది బడ్జెట్ ధరలో వినియోగదారులను ఆపిల్ ఏఐ ఆవిష్కరణలను అనుభవించడానికి అనుమతిస్తుంది.
ఐఫోన్ ఎస్ఈ 4.. ఐఫోన్ 16 అమ్మకాలను ప్రభావితం చేస్తుందని చాలా మంది చెబుతున్నారు. ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ అయితే, అది ఐఫోన్ 16 అమ్మకాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఐఫోన్ ఎస్ఈ 4లో ఐఫోన్ 16 వంటి రియర్ డిజైన్, పవర్ఫుల్ చిప్‌సెట్, ఓఎల్ఈడీ డిస్‌ప్లే, అధునాతన ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. యాక్షన్ బటన్, ఏ18 చిప్‌సెట్, యూఎస్బీ-సీ పోర్టు కూడా ఇందులో ఉండవచ్చు. ఈ విషయాలు నిజమైతే కేవలం ఆపిల్ ఇంటెలిజెన్స్ కోసం మాత్రమే కొత్త ఐఫోన్ 16 కొనాలనుకునేవారు తగ్గవచ్చు. లేటెస్ట్ ఫీచర్లకు అప్ గ్రేడ్ కావాలనుకునే ఆపిల్ యూజర్లు ఐఫోన్ ఎస్ఈ 4కు కొనే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
ఐఫోన్ ఎస్ఈ 3లో 4 జీబీ ర్యామ్ ఉంది. ఐఫోన్ ఎస్ఈ 4లో 8 జీబీ ర్యామ్ వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లలో 6 జీబీ ర్యామ్ ఉంటుంది. ఐఫోన్ ఎస్ఈలో ర్యామ్ జంప్ కు ఆపిల్ ఇంటెలిజెన్స్ హార్డ్ వేర్ అవసరాలే కారణమని భావిస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ 4 ధర 500 డాలర్ల కేటగిరీలోకి వస్తుందని అంటున్నారు. ఐఫోన్ ఎస్ఈ 4 ప్యానెల్ రాబోయే ఐఫోన్ 16ను పోలి ఉంటుందని, ముందు భాగంలో ఇది ఐఫోన్ 14 లాగా ఉండవచ్చని చెబుతున్నారు.