Repair iPhone from Water Damage : మీ ఐఫోన్​ నీటిలో పడిందా? బియ్యం బస్తాలో పెడితే మాత్రం ప్రమాదమే!-how to repair iphone from water damage dont put it in rice bag ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Repair Iphone From Water Damage : మీ ఐఫోన్​ నీటిలో పడిందా? బియ్యం బస్తాలో పెడితే మాత్రం ప్రమాదమే!

Repair iPhone from Water Damage : మీ ఐఫోన్​ నీటిలో పడిందా? బియ్యం బస్తాలో పెడితే మాత్రం ప్రమాదమే!

Sharath Chitturi HT Telugu
Sep 01, 2024 01:40 PM IST

iPhone water damage tips : మీ ఐఫోన్​లో నీటిలో పడిపోయిందా? తీసుకెళ్లి బియ్యం బస్తాలో పెట్టారా? అది చాలా ప్రమాదకరం! ఈ విషయాన్ని స్వయంగా యాపిల్​ సంస్థ వెల్లడించింది. మరి ఐఫోన్​ నీటిలో పడితే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి..

ఐఫోన్​ నీటిలో పడితే ఏం చేయలి?
ఐఫోన్​ నీటిలో పడితే ఏం చేయలి?

‘ఐఫోన్​ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలి,’ వంటి మీమ్స్​ ఎక్కువగాw వినిపిస్తుంటాయి. ఎందుకంటే యాపిల్​ తయారు చేసే ఐఫోన్స్​ చాలా ఖరీదైనవి. ఐఫోన్స్​ మాత్రమే కాదు, వాటి రిపేర్​- సర్వీస్​లు కూడా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఈ స్మార్ట్​ఫోన్స్​ని చాలా భద్రంగా చూసుకోవాలి. కానీ ఒక్కోసారి ఎంత భద్రంగా చూసుకున్నా, ఐఫోన్స్​ కిందపడటం జరగొచ్చు. మరీ ముఖ్యంగా చాలా మంది తమ స్మార్ట్​ఫోన్స్​ని నీటిలో పడేసుకుంటారు. ఆ తర్వాత బాధపడుతుంటారు. "ఐఫోన్​ నీటిలో పడితే ఏం చేయాలి?" అని ఆన్​లైన్​లో సెర్చ్​ చేసి, బియ్యం బస్తాలో పెడుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం! ఇలా చేస్తే.. మీరు మీ ఫోన్​కి మరింత హాని కలిగించినట్టు అవుతుందని మీకు తెలుసా?

ఐఫోన్​ నీటిలో పడిపోతే ఏమి చేయాలి?

ముందుగా ఆన్​లైన్​లో టిప్స్​ సూచించినట్టు బియ్యం బస్తాలో ఐఫోన్​ని వేయకూడదు. తడిసిన ఐఫోన్​ని బియ్యంలో ఉంచవద్దని యాపిల్ సంస్థ స్వయంగా తన వినియోగదారులకు అధికారికంగా సూచించింది. "అలా చేయడం వల్ల చిన్న బియ్యం కణాలు (రైస్​ పార్టికల్స్​) మీ ఐఫోన్​ని దెబ్బతీస్తాయి," అని యాపిల్​ వివరించింది.

మీరు అనుకోకుండా మీ ఐఫోన్​ని నీటిలో పడేస్తే చేయాల్సినవి, చేయకూడనివి ఈ కింద తెలుసుకోండి..

ఇలా చేయండి (డూస్)..,

  • మీ ఐఫోన్​ను కనెక్టర్​తో మీ చేతికి సున్నితంగా నొక్కండి. తద్వారా లోపల ఉన్న అదనపు నీరు ఖాళీ అవుతుంది.
  • తరువాత పొడి ప్రదేశంలో వదిలేయండి.
  • కనీసం 30 నిమిషాల తర్వాత, స్మార్ట్​ఫోన్​ని ఛార్జ్ చేయడానికి లేదా యాక్ససరీని కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. అలర్ట్ మళ్లీ ఆన్ అయితే, కనెక్టర్​లో, పిన్స్ కింద లేదా కేబుల్లో నీరు ఉందని అర్థం. మళ్లీ ప్రయత్నించే ముందు, కనీసం ఒక రోజు పొడి ప్రదేశంలో ఉంచండి.

ఇలా చేయకండి (డోన్ట్​)..

  • బాహ్య వనరును ఉపయోగించి లేదా కంప్రెస్డ్ గాలిని ఉపయోగించడం ద్వారా మీ ఐఫోన్​ని ఎండబెట్టడానికి ప్రయత్నించవద్దు.
  • కాటన్ స్వాబ్ లేదా పేపర్ టవల్ వంటి వస్తువులను కనెక్టర్​లోకి చొప్పించవద్దు.
  • ఫోన్ ఎండిపోయిందని నిర్ధారించుకునే వరకు ఛార్జింగ్ కేబుల్ లేదా ఏదైనా యాక్సెసరీని ప్లగ్ చేయవద్దు.
  • మొదట్లో చెప్పినట్లు బియ్యం బస్తాలో వేయకూడదు.

ఈ యాపిల్​ ప్రాడక్ట్స్​కి గుడ్​ బై..?

2024 మచ్​ అవైటెడ్​ స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​లో యాపిల్​ ఐఫోన్​ 16 సిరీస్​ ఒకటి. సెప్టెంబర్ 9న జరగనున్న ఈవెంట్​లో కొత్త ఐఫోన్లు, ఎయిర్​పాడ్స్, యాపిల్ వాచ్​లను సంస్థ లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఈవెంట్ తర్వాత, ఇప్పటికే ఉన్న అనేక యాపిల్ ప్రాడెక్ట్స్​కి సంస్థ గుడ్​బై చెబుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గతేడాది లాంచ్​ అయిన యాపిల్​ ఐఫోన్​ 15 సిరీస్​లోని కొన్ని మోడల్స్​ని సంస్థ డిస్కంటిన్యూ చేస్తుందని సమాచారం. సెప్టెంబర్​లో కొత్త గ్యాడ్జెట్స్​ లాంచ్ తరువాత యాపిల్ అధికారిక స్టోర్ నుంచి నిలిచిపోయే పరికరాల జాబితా ఇక్కడ ఉంది..

సంస్థ నుంచి వచ్చిన తొలి టిటానియం కేస్​ మోడల్స్​ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లను యాపిల్ వదులుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మోడళ్లు 6.1-ఇంచ్​, 6.7-ఇంచ్​ డిస్​ప్లేలతో చివరి ప్రో వర్షెన్లు కావచ్చు. ఎందుకంటే భవిష్యత్తు ప్రో మోడళ్లు మరింత పెద్ద స్క్రీన్లను కలిగి ఉండవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం