Index Mutual funds : తక్కువ రిస్క్​తో సూపర్​ రిటర్నులు- ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​తోనే సాధ్యం!-investment tips what is index mutual fund and its benefits ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Index Mutual Funds : తక్కువ రిస్క్​తో సూపర్​ రిటర్నులు- ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​తోనే సాధ్యం!

Index Mutual funds : తక్కువ రిస్క్​తో సూపర్​ రిటర్నులు- ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​తోనే సాధ్యం!

Sharath Chitturi HT Telugu
Jan 15, 2024 10:33 AM IST

Index Mutual funds : మ్యూచువల్​ ఫండ్స్​లో చాలా రకాలు ఉంటాయి. మరి వాటిల్లో ఏది లాంగ్​ టర్మ్​ని ఎంచుకోవాలి? అని ఆలోచిస్తున్నారా? తక్కువ రిస్క్​తో మంచి రిటర్నులు పొందాలంటే.. ఇది మీరు తెలుసుకోవాల్సిందే..

తక్కువ రిస్క్​తో సూపర్​ రిటర్నులు- ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​తోనే!
తక్కువ రిస్క్​తో సూపర్​ రిటర్నులు- ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​తోనే!

Index Mutual funds investment : మీ ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీని ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్నారా? మ్యూచువల్​ ఫండ్స్​పై మీకు ఆసక్తి ఉందా? కానీ.. చాలా ఆప్షన్స్​ కనిపించే సరికి కన్ఫ్యూజ్​ అవుతున్నారా? అయితే ఇది మీకోసమే! తక్కువ రిస్క్​తో లాంగ్​ టర్మ్​లో అద్భుత సంపదను సృష్టించుకునేందుకు ఉపయోగపడే 'ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​' గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము..

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​తో అనేక లాభాలు..!

సెన్సెక్స్​, నిఫ్టీ వంటి సూచీల్లో ఇన్​వెస్ట్​ చేయడమే ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే! ఒక ఉదాహరణతో దీనిని అర్థం చేసుకుందాము. నిఫ్టీ 50లో.. 50 సంస్థలకు చెందిన స్టాక్స్​ ఉంటాయి. అవి పెరుగుతూ ఉంటే.. నిఫ్టీ 50 వృద్ధిచెందుతుంది కదా. ఆయా స్టాక్స్​ పడితే.. నిఫ్టీ పతనమవుతుంది కదా. నిఫ్టీ 50 ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ కూడా ఇంతే! ఇందులో నిఫ్టీ 50కి చెందిన స్టాక్సే ఉంటాయి. అందువల్ల.. నిఫ్టీ 50 రిటర్నుల తగ్గట్టుగానే నిఫ్టీ 50 మ్యూచువల్​ ఫండ్​లోనూ రిటర్నులు ఉంటాయి.

What is Index Mutual fund : ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ విషయంలో మేనేజర్లు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక ఇండెక్స్​ని ఎంచుకుని అందులోని స్టాక్స్​లో ఎప్పటికప్పుడు మదుపర్ల నగదును పెడితే సరిపోతుంది. అదే యాక్టివ్​ మ్యూచువల్​ ఫండ్స్​లో అయితే.. మదుపర్లకు మంచి రిటర్నులు తెచ్చిపెట్టేందుకు వివిధ స్టాక్స్​ను ఎనలైజ్​ చేస్తారు ఫండ్​ మేనేజర్లు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​లో.. ఫండ్​ మేనేజర్ల పని పెద్దగా ఉండదు!

వీరికి.. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​ బెస్ట్​..

ఇటీవలి కాలంలో స్టాక్​ మార్కెట్​లు చాలా బాగా రాణిస్తున్నాయి. ఇది ప్రతి రోజు వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది స్టాక్​ మార్కెట్​లో డబ్బులు పెడుతున్నారు. అయితే.. ఈక్విటీ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టాలనుకుని, స్టాక్స్​ని ఎనలైజ్​ చేసేందుకు సమయం లేని వారికి ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ సరిగ్గా సెట్​ అవుతాయనే చెప్పుకోవాలి.

Index Mutual funds investment tips : యాక్టివ్​ మ్యూచువల్​ ఫండ్స్​లో అయితే.. ఫండ్​ మేనేజర్ల నిర్ణయాలు ఒక్కోసారి బెడిసికొడతాయి. అప్పుడు మదుపర్లకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​లో ఫండ్​ మేనేజర్ల పాత్ర చాలా తక్కువ కాబట్టి.. ఆ భయాలు అవసరం లేదు. అందువల్ల ఇతర మ్యూచువల్​ ఫండ్స్​తో పోల్చితే.. ఇందులో రిస్క్​ తక్కువగా ఉంటుంది.

కానీ.. అధిక రిటర్నులు పొందాలంటే.. అందుకు తగ్గ రిస్క్​ చేయాలి. అందువల్ల.. సూచీలు ఇచ్చే రిటర్నుల కన్నా అధిక రిటర్నులు కావాలి అని అనుకునే వారికి ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ మంచి ఆప్షన్​ అవ్వకపోవచ్చు!

ఇవి తెలుసుకుని ఇన్​వెస్ట్​ చేయండి..

రిస్క్​- రివార్డ్​:- మార్కెట్లు పెరుగుతుంటే.. సూచీలు కూడా పెరుగాయి. అప్పుడు ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ కూడా వృద్ధిచెందుతుంది. కానీ మార్కెట్లు పడితే.. సూచీలు, ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ కూడా పడతాయి. సాధారణంగా.. మార్కెట్లు పడిపోతుంటే.. ఫండ్​ మేనేజర్లు తమ నిర్ణయాలతో నగదును వేరే స్టాక్స్​కు మళ్లించే అవకాశం ఉంటుంది. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​లో అలాంటి అవకాశాలు ఉండవు. అందుకే.. 12శాతం రిటర్నులు వస్తే చాలు అనుకునే వారికి బెస్ట్​ ఆప్షన్​ ఇండెక్స్​ ఫండ్స్​.

Stock market investment tips in Telugu : ఎక్స్​పెన్స్​ రేషియో:- మీ పెట్టుబడులను మేనేజ్​ చేస్తుండటం కారణంగా ఫండ్​ హౌజ్​కు.. మీకు వచ్చే రిటర్నుల నుంచి కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. దానినే ఎక్స్​పెన్స్​ రేషియో అని అంటారు. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ విషయంలో అతి పెద్ద లాభదాయకమైన విషయం ఇక్కడే ఉంటుంది. ఫండ్​ మేనేజర్​ ప్రమేయం తక్కువ కాబట్టి.. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​లో ఎక్స్​పెన్స్​ రేషియో కూడా తక్కువగానే ఉంటుంది.

గోల్స్​కి వాల్యూ ఇచ్చి:- మ్యూచువల్​ ఫండ్స్​ ఎప్పుడూ లాంగ్​ టర్మ్​లో అద్భుత రిటర్నులు ఇస్తాయి. కనీసం 7ఏళ్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న ఇన్​వెస్టర్లకు ఈ ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ ఉపయోగపడుతుంది. స్వల్పకాలంలో ఈ రకం ఫండ్స్​లో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. 7ఏళ్ల కాలంలో 10-12శాతం రిటర్నులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల దీర్ఘకాలం పెట్టుబడుల కోసమే ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​వైపు చూడాలి.

ట్యాక్స్ ఎంత కట్టాలంటే​:- ఈక్విటీ ఫండ్​ కావడంతో ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ ద్వారా వచ్చే డబ్బులపై ట్యాక్స్​ కట్​ అవుతుంది. ఇక ఫండ్​ హౌజ్​.. డివిడెండ్లు చెల్లిస్తే.. అందులో 10శాతం డివిడెండ్​ డిస్ట్రిబ్యూషన్​ ట్యాక్స్ (డీడీటీ) కట్​ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.

(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం ప్రచురించిన స్టోరీ మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి పెట్టేముందు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం