Hyundai India car sales : హ్యుందాయ్​ ఇండియా కార్​ సేల్స్​లో 8.8శాతం వృద్ధి-hyundai india reports cumulative sales of 57851 units in february ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai India Car Sales : హ్యుందాయ్​ ఇండియా కార్​ సేల్స్​లో 8.8శాతం వృద్ధి

Hyundai India car sales : హ్యుందాయ్​ ఇండియా కార్​ సేల్స్​లో 8.8శాతం వృద్ధి

Sharath Chitturi HT Telugu
Mar 01, 2023 01:40 PM IST

Hyundai India car sales : ఫిబ్రవరి కార్​ సేల్స్​ డేటాను ప్రకటించింది హ్యుందాయ్​ ఇండియా. మొత్తం మీద 8.8శాతం వృద్ధిని సాధించింది!

హ్యుందాయ్​ ఇండియా కార్​ సేల్స్​లో 8.8శాతం వృద్ధి
హ్యుందాయ్​ ఇండియా కార్​ సేల్స్​లో 8.8శాతం వృద్ధి (REUTERS)

Hyundai India car sales : ఫిబ్రవరి నెలకు సంబంధించిన కార్​ సేల్స్​ను ప్రకటించింది ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​ ఇండియా. గత నెలలో దేశీయంగా 47,001 యూనిట్​లను విక్రయించింది. గతేడాది ఇదే నెలతో (44,050) పోల్చుకుంటే అది 6.7శాతం అధికం. ఇక గత నెలలో 10,850 యూనిట్​లను విదేశాలకు ఎగుమతి చేసింది. 2022 ఫిబ్రవరి అది 9,109గా ఉంది. అంటే 19.1శాతం వృద్ధిని నమోదు చేసినట్టు. మొత్తం మీద.. గత నెలలో 57,851 యూనిట్​లను విక్రయించింది హ్యుందాయ్​ ఇండియా. గతేడాది ఇదే సమయంతో (53,159) పోల్చుకుంటే అది 8.8శాతం ఎక్కువ.

కొత్తగా లాంచ్​ అయిన ఐయానిక్​ 5, టుక్సాన్​, గ్రాండ్​ ఐ10 నియోస్​, ఆరాలకు మంచి డిమాండ్​ కనిపిస్తోందని, ఫలితంగా అమ్మకాల్లో వృద్ధి సాధిస్తున్నామని హ్యుందాయ్​ ఇండియా పేర్కొంది. ఇక హ్యుందాయ్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న క్రేటాకు డిమాండ్​ ఏమాంత్రం తగ్గడం లేదు. లాంచ్​ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 8.3లక్షల క్రేట్​ యూనిట్​లు అమ్ముడుపోయినట్టు హ్యుందాయ్​ ఇండియా స్పష్టం చేసింది.

Hyundai India car sales in February : "ఇండియాలోని అన్ని సెగ్మెంట్​లలో సేల్స్​ నెంబర్లు సంతోషకరంగా ఉన్నాయి. ప్రజల నమ్మకం దక్కుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది," అని హ్యుందాయ్​ ఇండియా స్పష్టం చేసింది.

ఎంజీ మోటార్​..

ఫిబ్రవరి నెలకు సంబంధించిన సేల్స్​ను ఎంజీ హెక్టార్​ ప్రకటించింది. గత నెలలో 4,193 యూనిట్​లను విక్రయించింది. సప్లై చెయిన్​ వ్యవస్థలో ఆటంకాలు ఎదురైనట్టు, కానీ ఎస్​యూవీల తయారీపై అధిక దృష్టిపెట్టినట్టు సంస్థ స్పష్టం చేసింది.

MG motors February car sales : మరోవైపు 2023 ఆటో ఎక్స్​పోలో ఆవిష్కరించిన నెక్స్ట్​ జెన్​ హెక్టార్​ బుకింగ్స్​ జోరుగా సాగుతున్నట్టు సంస్థ వెల్లడించింది. కొత్త హెక్టార్​లో 1.5 లీటర్​ పెట్రోల్​, 1.5 లీటర్​ పెట్రోల్​ హైబ్రీడ్​, 2.0 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ వస్తున్నాయి.

Whats_app_banner