New tax regime: కొత్త పన్ను విధానం నుంచి పాత విధానానికి; పాత పన్ను విధానం నుంచి కొత్త విధానానికి ఎన్నిసార్లు మారవచ్చు?
New tax regime to Old tax regime: గత బడ్జెట్ లో కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆదాయ పన్ను విధానాన్ని డీఫాల్ట్ విధానంగా నిర్ధారించింది. అంటే, ఒక వ్యక్తి పాత ఆదాయ పన్ను కావాలని కోరుకున్నవారికి తప్ప.. మిగతా అందరికీ కొత్త ఆదాయపు పన్ను విధానం వర్తిస్తుంది.
New tax regime to Old tax regime: ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఆదాయ పన్ను విధానం డీఫాల్ట్ విధానంగా అమల్లోకి వచ్చింది. కానీ, పాత పన్ను విధానం కూడా కొనసాగుతుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు కోరుకుంటే, పాత విధానంలో కొనసాగవచ్చు. అయితే, ఈ రెండు విధానాల మధ్య.. ఒక పన్ను విధానం నుంచి మరో పన్ను విధానంలోకి ఎన్నిసార్లు మారవచ్చు? అన్న ప్రశ్నతో పాటు పలు ప్రశ్నలు టాక్స్ పేయర్స్ లో వస్తున్నాయి.
ఎన్నిసార్లు మారవచ్చు అంటే..?
ఒక వ్యక్తి ప్రతి ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని (New tax regime) కానీ, లేదా పాత పన్ను విధానాన్ని కానీ ఎంచుకోవచ్చు. ఇలా, ఎన్ని సార్లైనా ఎంచుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం కేవలం వేతన ఆదాయం ఉన్న, వ్యాపార ఆదాయం లేని వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వారు తమ జీవిత కాలంలో ఒక్క సారి మాత్రమే ఈ మార్పు చేసుకునే సదుపాయం పొందుతారు. వేతనం ద్వారా ఆదాయం పొందుతున్నవారికి తమ పన్ను విధానాన్ని మార్చుకునే అవకాశం ప్రతీ సంవత్సరం లభిస్తుంది. అయితే, వీరు గడువులోపు తమ ఐటీఆర్ లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆలస్యంగా ఐటీఆర్ (ITR) లను ఫైల్ చేస్తే, ఆటోమేటిక్ గా కొత్త పన్ను విధానంలోకి వెళ్తారు.
ఎవరికి వీలు కాదు..?
ఆదాయ పన్ను చట్టాల ప్రకారం, వ్యాపారం ద్వారా ఆదాయం పొందే ఆదాయ పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరం పాత, కొత్త పన్ను విధానాలను మార్చుకోలేరు. వ్యాపారం ద్వారా ఆదాయం పొందే ఆదాయ పన్ను చెల్లింపుదారులు, అలాగే, HUFలు కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, వారు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత, పాత పన్ను విధానానికి తిరిగి వెళ్లడానికి వారికి ఒకే ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. లేదా, వారు ఇప్పటికే పాత విధానాన్ని ఎంచుకుంటే భవిష్యత్ ఆర్థిక సంవత్సరాల్లో కొత్త ఆదాయపు పన్ను విధానానికి వెళ్లలేరు.
ఏ పన్ను విధానమో చెప్పకపోతే..?
వేతనం ద్వారా ఆదాయం పొందే వ్యక్తి తను కొనసాగించదలచుకున్న ఆదాయపు పన్ను విధానాన్ని పేర్కొనకపోతే.. వారు ఉద్యోగం చేస్తున్న కంపెనీ డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానాన్ని కొనసాగిస్తుంది. ఒకసారి పన్ను విధానాన్ని నిర్ణయించుకున్న తరువాత, ఆ విధానాన్ని, ఆ సంవత్సరంలో మళ్లీ మార్చలేమని గుర్తుంచుకోవాలి.
కంపెనీకి చెప్పిన విధానమే కొనసాగించాలా?
ఆదాయ పన్ను చట్టాలు ఒక ఉద్యోగి తన కంపెనీకి తెలియజేసిన పన్ను విధానానికి భిన్నమైన పన్ను విధానంతో తన ఐటీఆర్ ను ఫైల్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఒకవేళ, మీరు మీ కంపెనీకి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నట్లు చెప్పి కూడా, ఐటీఆర్ (ITR) ను పూర్తి చేస్తున్నప్పుడు పాత పన్ను విధానాన్ని కొనసాగించవచ్చు. అయితే, మీ ఐటీఆర్ ను జూలై 31న లేదా అంతకు ముందు ఫైల్ చేసి ఉండాలి.
ఆదాయ పన్ను స్లాబ్స్ ఇవే..
ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లు అమల్లోకి వచ్చాయి. అవి ఈ క్రింది విధంగా ఉంటాయి
ఆదాయం - పన్ను శాతం
0-3 లక్షలు - 0%
3-6 లక్షలు - 5%
5.6-9 లక్షలు - 10%
10.9-12 లక్షలు - 15%
15.12-15 లక్షలు - 20%
15 లక్షలకు పైబడి - 30%