New tax regime: ‘‘కొత్త పన్ను విధానానికే మెజారిటీ ఓటు’’
New tax regime: వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త ఆదాయ పన్ను విధానం (new income tax regime) లోకి వెళ్తారని సీబీడీటీ చైర్మన్ తెలిపారు.
New tax regime: కనీసం 65% కొత్త విధానంలోకి..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది, అంటే సుమారు 66% ఆదాయ పన్ను చెల్లింపుదారులు కొత్త ఆదాయ పన్ను విధానం (new income tax regime)లోకి మారుతారని అనుకుంటున్నానని Central Board of Direct Taxes CBDT chairman నితిన్ గుప్తా తెలిపారు. తాజా బడ్జెట్ లో రూ. 7 లక్షల ఆదాయం వరకు ఆదాయ పన్నుపై రిబేటు లభించడం ముదావహమన్నారు. ‘కొత్త పన్ను విధానం (new income tax regime) లోకి మారే విషయంలో పన్ను చెల్లింపుదారులకే తుది నిర్ణయం వదిలేశాం. కొత్త పన్ను విధానం (new income tax regime), పాత పన్ను విధానం (new income tax regime)లలో ఉన్న లాభ నష్టాలను అంచనా వేసుకున్న తరువాత పన్ను చెల్లింపుదారులే తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, కొత్త విధానంలో ఉన్న సౌలభ్యం కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనీసం 66% ట్యాక్స్ పేయర్స్ కొత్త విధానం (new income tax regime) లోకి మారుతారని ఆశిస్తున్నా’ అన్నారు.
New tax regime: 7 లక్షల వరకు రిబేటు మంచి నిర్ణయం
రూ. 7 లక్షల వరకు ఆదాయ పన్నులో రిబేటు (tax rebate) లభించడం వల్ల ఉద్యోగస్తులు, ఇతర వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. రిబేటు (tax rebate) కారణంగా వారి వద్ద ఉండే నగదు మొత్తం పెరుగుతుందని, తద్వారా వారి కొనుగోలు శక్తి పెరుగుతుందని వివరించారు. ఆదాయ పన్నులో ఆరు స్లాబ్స్ (six tax slabs) ను ఐదు స్లాబ్స్ (five tax slabs) కు తగ్గించడం కూడా సరైన నిర్ణయమేనన్నారు. స్లాబ్స్ విస్తృతి కారణంగా కూడా కొత్త పన్ను విధానంలోకి మెజారిటీ ప్రజలు వస్తారన్నారు. రూ. 7 లక్షలకు మించిన అదాయం ఉన్నవారికి రూ. 50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుందని నితిన్ గుప్తా గుర్తు చేశారు. అంటే, మొత్తంగా రూ. 7.5 లక్షల ఆదాయం ఉన్నవారు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.