Old vs New income tax slabs: ఆదాయ పన్ను విధానాల్లో ఏది బెటర్? పాతదా? కొత్తదా?
Old vs New income tax slabs: ఆదాయ పన్ను స్లాబ్స్ విధానానికి సంబంధించి తాజా బడ్జెట్లో (Union Budget) కీలక మార్పులు చేశారు. కొత్త స్లాబ్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. అయితే, ఇప్పటికీ ఏ విధానం మంచిదనే విషయంలో పన్ను చెల్లింపుదారుల్లో ఇంకా అనుమానాలున్నాయి.
Old vs New income tax slabs: ఆదాయ పన్ను చెల్లింపునకు సంబంధించి Union Budget లో కీలక మార్పులు చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు. ముఖ్యంగా కొత్త స్లాబ్ విధానంలో టాక్స్ పేయర్ కు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నారు. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారుకు ఉపశమనం కలిగేలా ఈ మార్పులు చేపట్టామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల వివరించారు.
Old vs New income tax slabs: 7 లక్షల వరకు నో ట్యాక్స్
కొత్త పన్ను చెల్లింపు విధానం (new income tax slabs) డీ ఫాల్ట్ గా ఉంటుందని, అయితే, పన్ను చెల్లింపుదారు (tax payer) కోరుకుంటే, పాత విధానాన్ని (old income tax slabs) వారికి కొనసాగిస్తామని ఆర్థికమంత్రి (Nirmala Sitharaman) తెలిపారు. దాంతో, ఏ విధానం ఎంచుకోవాలో తెలియని గందరగోళం పన్ను చెల్లింపుదారుల్లో నెలకొంది. ఏ విధానంలో ఎక్కువ రాయితీ లభిస్తుందో లెక్క గట్టిన తరువాతనే, పాత విధానంలో (old income tax slabs) కొనసాగడమా? లేక కొత్త విధానానికి (new income tax slabs) మారడమా? అనే నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఈ రెండు విధానాల్లోనూ రూ. 5 లక్షల వరకు పన్ను ఉండేది కాదు. కొత్త పన్ను చెల్లింపు విధానంలో (new income tax slabs) రూ. 7 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో తొలి రూ. 3 లక్షలకు పన్ను ఉండదు. మిగతా నాలుగు లక్షలకు పన్ను రిబేటు లభిస్తుంది.
Old vs New income tax slabs: కొత్త విధానంలో స్లాబ్ ల సంఖ్య ఐదు
కొత్త పన్ను విధానంలో (new income tax slabs) స్లాబ్ ల సంఖ్యను ఐదుకు తగ్గించారు.
- రూ. 3 లక్షల వరకు పన్ను లేదు
- రూ. 3 నుంచి రూ. 6 లక్షల మధ్య 5% పన్ను
- రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు 10%
- రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15%
- రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 20%
- రూ. 15 లక్షల పైన 30%.
కొత్త విధానంలో (new income tax slabs) స్టాండర్డ్ డిడక్షన్ (standard deduction) సదుపాయం వర్తిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. రూ. 15.5 లక్షలకు మించి ఆదాయం ఉన్న ప్రతీ ఉద్యోగి రూ. 52,500 స్టాండర్డ్ డిడక్షన్ (standard deduction) సదుపాయం పొందుతారు.
Old vs New income tax slabs: పాత పన్ను విధానం..
పాత పన్ను విధానం (old income tax slabs) లో
- రూ. 2.5 లక్షల వరకు పన్ను లేదు
- రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5%
- రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు 15%
- రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 20%
- రూ. 10 లక్షలకు మించిన ఆదాయానికి రూ. 30% పన్ను ఉంటుంది.
Old vs New income tax slabs: ఏది బెటర్?
ఈ రెండు విధానాల్లో ఏది బెటర్ అనే విషయంలో చాలా గందరగోళం నెలకొన్నది. కొత్త పన్ను విధానంలో 80సీ, 80డీ తదితర సెక్షన్ల కింద మినహాయింపులేవీ ఉండవు. పాత పన్ను విధానంలో (old income tax slabs) ఆ మినహాయింపులు కొనసాగుతాయి. ఈ రెండు విధానాల్లోనూ రూ. 5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు. మొత్తంగా ప్రముఖ టాక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ ప్లాట్ ఫామ్ ‘క్లియర్’ తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎలాంటి మినహాయింపులు పొందని వారికి కొత్త స్లాబ్ విధానం (new income tax slabs) లాభదాయకం. మినహాయింపులు పొందేవారు మాత్రం రెండు విధానాలలో చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కించి, తక్కువ పన్ను చెల్లించే అవకాశం ఉన్న విధానాన్ని ఎంచుకోవడం మంచిది.
ఉదాహరణకు రూ. 15 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి, 4% ఎడ్యుకేషన్ సెస్ తో కలుపుకుని కొత్త విధానం (new income tax slabs) లో రూ. 1.56 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే, వ్యక్తి ఒకవేళ పాత విధానం (old income tax slabs) లో పన్ను చెల్లించాలని నిర్ణయించుకుంటే, రూ. 2.73 లక్షలు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.
టాపిక్