Budget 2023 New Income Tax Slabs: మీ ట్యాక్స్‌ను ఎలా లెక్కించుకోవచ్చంటే..
Budget 2023 New Income Tax Slabs: కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) ఎంపిక చేసుకునే వారు రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం వచ్చింది. బడ్జెట్‍లో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక పన్ను కొత్త శ్లాబుల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది.
Budget 2023 New Income Tax Slabs: వేతన జీవులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరట కల్పించారు. 2023-24 కేంద్ర బడ్జెట్‍లో ఆదాయపు పన్ను గురించి కీలక ప్రకటనలు చేశారు. దీంతో మీ ఆదాయపు పన్ను లెక్కల్లో మార్పులు ఉండనున్నాయి.
కొత్త పన్ను విధానం (New Tax Regime) ఎంపిక చేసుకునే వారికి రూ.7లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితి (Income Tax Rebate) ఉంటుంది. వీరు రూ.7లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో రూ.5లక్షలుగా ఉన్న దీన్ని రూ.7లక్షలకు పెంచింది కేంద్రం.
కొత్త ఆదాయపు పన్ను స్లాబులు (వార్షికాదాయంపై)
- 0 - రూ.3లక్షలు - పన్ను లేదు
- రూ.3లక్షల నుంచి రూ.6లక్షలు - 5 శాతం
- రూ.6లక్షల నుంచి రూ.9లక్షలు - 10 శాతం (New Tax Regime Tax Slab)
- రూ.9లక్షల నుంచి రూ.12లక్షలు - 15 శాతం
- రూ.12లక్షల నుంచి రూ.15లక్షలు - 20 శాతం
- రూ.15లక్షలకు పైగా - 30 శాతం
కొత్త పన్ను విధానం vs పాత పన్ను విధానం
New Regime vs Old Regime: ఐటీ రిటర్నులు దాఖలు చేసే సమయంలో ఇప్పటి నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉంటుంది. అయితే పన్ను చెల్లింపుదారులు పాత విధానాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. పాత పన్ను విధానం (Old Tax Regime) కింద ఉన్న వారు పీపీఎఫ్, ఎన్‍పీఎస్‍తో పాటు మరిన్ని మినహాయింపులకు క్లయిమ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. రూ.7లక్షల వార్షికాదాయం కంటే ఎక్కువ ఉన్న వారు వారి అవసరానికి అనుగుణంగా కొత్త, పాత పన్ను విధానాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.
పాత పన్ను విధానం (Old Tax Regime)
పాత పన్ను విధానం కింద, రూ.2.5లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను (Personal Income Tax) మినహాయింపు ఉంటుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ పన్ను శ్లాబులు ఎలా ఉన్నాయంటే..
- 0 - రూ.2.5లక్షలు - పన్ను లేదు
- రూ.2.5లక్షలు - రూ.5లక్షలు - 5 శాతం
- రూ.5లక్షలు - రూ.7.5లక్షలు - 15 శాతం
- రూ.7.5లక్షలు - రూ.10లక్షలు - 20 శాతం
- రూ.10లక్షల కంటే ఎక్కువ - 30 శాతం
లెక్కింపు: ఎంత మిగులుతుంది?
రూ.9లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి కొత్త విధానం ప్రకారం వారి వేతనంలో 5శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ.45,000గా ఉంది. గతంలో వీరు రూ.60వేల పన్ను చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు రూ.15వేల సేవ్ చేసుకోవచ్చు. ఇక రూ.15లక్షల వార్షికాదాయం ఉన్న వ్యక్తి ఇప్పుడు రూ.1.5లక్షల పన్ను చెల్లించాలి. గతంలో ఇది రూ.1.87లక్షలు అయ్యేది.
ఇన్‍కమ్ ట్యాక్స్ శాఖ వెబ్‍సైట్‍లో Income tax calculator ఉంటుంది. దీని ద్వారా మీ ఆదాయం పన్ను ఎంత పడుతుందో లెక్కించుకోవచ్చు. లింక్ ఇదే..
ఇక గరిష్ఠ ఇన్‍కమ్ సర్‍చార్జీ 37 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గింది. “ప్రస్తుతం దేశంలో ట్యాక్స్ రేట్ 42.74శాతంగా ఉంది. ప్రపంచంలో అత్యధికంగా ఉన్న వాటిలో ఇది ఒకటి. కొత్త పన్ను విధానంలో గరిష్ఠ సర్‍చార్జీని 37 శాతం నుంచి 27 శాతం వరకు తగ్గించాలని 2023 బడ్జెట్‍లో ప్రతిపాదించాం” అని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
సంబంధిత కథనం