Budget 2023 : 'బడ్జెట్​'తో.. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?-budget 2023 what has become cheaper what s more expensive check full list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2023 : 'బడ్జెట్​'తో.. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?

Budget 2023 : 'బడ్జెట్​'తో.. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Feb 01, 2023 01:10 PM IST

Budget 2023 live updates : బడ్జెట్​ 2023లో పలు వస్తువలపై సుంకాలను పెంచింది కేంద్రం. మరికొన్నింటిపై తగ్గించింది. ఈ నేపథ్యంలో ఏ వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఓసారి చూద్దాం..

పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్​
పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్​ (PTI)

Budget 2023 live updates : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. బుధవారం పార్లమెంట్​లో బడ్జెట్​ 2023 ప్రవేశపెట్టారు. మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఊరటను కల్పిస్తూ.. పన్ను శ్లాబుల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. అదే సమయంలో పలు వస్తువులపై కస్టమ్స్​ సుంకాలను తగ్గించారు. ఇంకొన్ని వాటిపై పెంచారు. ఈ నేపథ్యంలో.. 'బడ్జెట్​' అనంతరం ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏవి తగ్గుతాయి? అన్న వివరాలను ఓసారి పరిశీలిద్దాము..

ఈ వస్తువులు మరింత ప్రియం..

  • గోల్డ్​ బార్స్​తో తయారు చేసిన వస్తువులపై బేసిక్​ కస్టమ్స్​ సుంకం పెంపు
  • Budget 2023 highlights : వంటింటి విద్యుత్​ చిమ్నిపై కస్టమ్స్​ సుంకం 7.5శాతం నుంచి 15శాతానికి పెంపు
  • సిగరెట్​పై కస్టమ్స్​ సుంకం పెంపు. సిగరెట్​ ధరలు 1.5-2శాతం పెరిగే అవకాశం ఉంది
  • సిల్వర్​ డోర్స్​, బార్స్​, కాపర్​తో తయారు చేసిన వస్తువుల ధరలు పెరుగుతాయి.
  • కాంపౌండ్​ రబ్బర్​, దుస్తుల ధరలు పెరుగుతాయి.

ఈ వస్తువుల ధరలు తగ్గుతాయి..

  • ల్యాబ్​లో తయారు చేసే డైమంట్స్​కు సంబంధించిన సీడ్స్​పై కస్టమ్స్​ సుంకం తగ్గింపు
  • Budget 2023 live streaming : ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ష్రింప్​ ఫీడ్​పై కస్టమ్స్​ సుంకం తగ్గింపు
  • టీవీ ప్యానెళ్లలలో ఉపయోగించే ఓపెన్​ సేల్స్​పై కస్టమ్స్​ సుంకం 2.5శాతానికి తగ్గింపు.
  • కెమెరా లెన్స్​లు, మొబైల్​ ఫోన్స్​, టీవీ విడి భాగాలు ధరలు తగ్గుతాయి.
  • డినేచర్డ్​ ఇథైల్​ ఆల్కోహల్​, యాసిడ్​ గ్రేడ్​ ఫ్లోరోస్పార్​ వంటి వాటి ధరలు తగ్గుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం