Govt raises cap on EPFO wage ceiling?: ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి పెంపు?
Govt raises cap on EPFO wage ceiling?: ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితిని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(Employees Provident Fund Organisation -EPFO) త్వరలో పెంచనుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు గరిష్ట వేతన పరిమితిని పెంచే అవకాశమున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి.
Govt raises cap on EPFO wage ceiling?: వ్యవస్థీకృత రంగాల్లోని ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం గౌరవనీయ జీవనం అందించడం లక్ష్యంగా ప్రభుత్వ రంగంలో ఈపీఎఫ్ఓ(Employees Provident Fund Organisation -EPFO) ఏర్పాటైంది. ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తం, యాజమాన్యం నుంచి కొంత మొత్తం.. ఉద్యోగి భవిష్యత్ అవసరాల కోసం ఇందులో ప్రత్యేకంగా జమ చేస్తారు. తాజాగా, ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సభ్యుల గరిష్ట వేతన పరిమితి విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.
Govt raises cap on EPFO wage ceiling to ₹21000?: రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు?
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ(Employees Provident Fund Organisation -EPFO)లో చేరే చందాదారుల గరిష్ట వేతన పరిమితి రూ. 15 వేలుగా ఉంది. ఈ మొత్తాన్ని రూ. 21 వేలకు పెంచనున్నట్లు సమాచారం. దీనిపై అధ్యయనం చేయడానికి త్వరలో ఒక కమిటీని వేయనున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఉద్యోగి, యజమాని చెల్లించే ప్రాతినిధ్య మొత్తం పెరుగుతుంది. ఆ మేరకు ఉద్యోగికి రిటైర్మెంట్ ప్రయోజనాలు లభిస్తాయి. సభ్యులకు ఈపీఎఫ్ఓ(Employees Provident Fund Organisation -EPFO) భవిష్య నిధి(provident fund)తో పాటు పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తుంది. అలాగే, ఉద్యోగి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఫ్యామిలీ పెన్షన్, బీమా సదుపాయం కూడా ఉంది.
Contributions in EPFO: ఎవరి వాటా ఎంత?
యాజమాన్యం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో (Employees Provident Fund Organisation -EPFO) ప్రతీనెల బేసిక్ వేతనంలో 12% చెల్లిస్తుంది. పెన్షన్ ఫండ్ కోసం ప్రభుత్వం 1.16% చెల్లిస్తుంది. యాజమాన్యం చెల్లించే 12% లో 8.33 శాతం మళ్లీ ఉద్యోగి పెన్షన్ అకౌంట్ లోకి వెళ్తుంది. అలాగే, ఆ ఉద్యగి వాటాగా బేసిక్ వేతనంపై 12% ప్రావిడెండ్ ఫండ్ లోకి వెళ్తుంది.
Govt raises cap on EPFO wage ceiling?: గతంలో సవరించారా?
గరిష్ట వేతన పరిమితిని గతంలో 8 సార్లు పెంచారు. ఈ ఈపీఎఫ్ పథకాన్ని 1952లో ప్రారంభించారు. అప్పడు గరిష్ట పరిమితి రూ. 300 గా ఉంది. ఆ తరువాత 1957లో రూ. 500లకు, 1962లో రూ. 1000కి, 1976లో రూ. 1600లకు, 1985లో రూ. 2500లకు, 1990లో రూ. 3000లకు, 1994లో రూ. 5000లకు, 2001లో రూ. 6500లకు గరిష్ట వేతన పరిమితిని పెంచారు. చివరగా 2014లో ఈ పరిమితిని రూ. 15 వేలకు పెంచారు. ఈపీఎఫ్ఓ(Employees Provident Fund Organisation -EPFO) తాజా లెక్కల ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ పథకంలో కొత్తగా 16.82 లక్షల మంది చేరారు.