Goldman Sachs Layoffs : దిగ్గజ ఇన్​వెస్ట్​మెంట్​ బ్యాంక్​లో ఉద్యోగాల కోత! ఏకంగా 8శాతం లేఆఫ్​?-goldman sachs layoffs investment bank to cut nearly 1 800 jobs ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Goldman Sachs Layoffs : దిగ్గజ ఇన్​వెస్ట్​మెంట్​ బ్యాంక్​లో ఉద్యోగాల కోత! ఏకంగా 8శాతం లేఆఫ్​?

Goldman Sachs Layoffs : దిగ్గజ ఇన్​వెస్ట్​మెంట్​ బ్యాంక్​లో ఉద్యోగాల కోత! ఏకంగా 8శాతం లేఆఫ్​?

Sharath Chitturi HT Telugu
Sep 02, 2024 06:40 AM IST

Goldman Sachs Layoffs 2024 : గోల్డ్​మన్​ శాక్స్​లో ఉద్యోగాల కోత మొదలైంది! వర్క్​ ఫోర్స్​లో 8శాతం ఉద్యోగులను తొలగించేేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం.

గోల్డ్​మన్​ శాక్స్​లో ఉద్యోగాల కోత!
గోల్డ్​మన్​ శాక్స్​లో ఉద్యోగాల కోత! (Reuters / Andrew Kelly)

2024లో కూడా ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్​ కొనసాగుతున్నాయి! కాస్ట్​ కటింగ్​ పేరుతో దిగ్గజ సంస్థలు ఉద్యోగాల కోతపై ఫోకస్​ చేస్తున్నాయి. ఈ జాబితాలోకి దిగ్గజ ఇన్​వెస్ట్​మెంట్​ బ్యాంకింగ్​ సంస్థ గోల్డ్​మన్​ శాక్స్​ చేరింది. వార్షిక సమీక్షలో భాగంగా తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్ నుంచి దాదాపు 1,300 నుంచి 1,800 మంది ఉద్యోగులను తొలగించాలని సంస్థ యోచిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.

గత ఏడాది చివరి నాటికి గోల్డ్​మన్ శాక్స్​ 45,300 మందిని నియమించుకుంది. ఉద్యోగుల్లో 3 శాతం నుంచి 4 శాతం వరకు ఉద్యోగాల కోత ఉంటుందని సమాచారం. అంటే 1,300 నుంచి 1,800 మంది ఉద్యోగులు జాబ్​ కోల్పోయే అవకాశం ఉంటుందని నివేదిక తెలిపింది. బ్యాంకులోని వివిధ విభాగాల్లో లేఆఫ్స్​ ఉంటాయి.

"వ్యూహాత్మక వనరుల మదింపు (స్ట్రాటెజిక్​ రిసోర్సెస్​ అసెస్​మెంట్​)" లేదా ఎస్ఆర్ఏలో ఈ లేఆఫ్స్​ భాగం. ఉద్యోగాల కోత ఇప్పటికే మొదలైంది. ఇంకొంత కాలం వరకు కొనసాగే అవకాశం ఉంది.

" మా వార్షిక ప్రతిభ సమీక్షలు సాధారణమైనవి, ప్రామాణికమైనవి, ఆనవాయితీగా వస్తున్నవి. అసాధారణమైనవి" అని గోల్డ్​మన్ శాక్స్​ ప్రతినిధి టోనీ ఫ్రాటోను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. కాగా 2023తో పోలిస్తే 2024 చివరి నాటికి గోల్డ్​మన్​లో మొత్తం హెడ్ కౌంట్ ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

గోల్డ్​మన్ సాధారణంగా పర్ఫార్మెన్స్​ ఆధారంగా వార్షికంగా మొత్తం వర్క్​ ఫోర్స్​లో 2% నుంచి 7% వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని నివేదిక పేర్కొంది. మార్కెట్ పరిస్థితులు, బ్యాంకు ఆర్థిక దృక్పథం కారణంగా ఈ రేంజ్​ కాలక్రమేణా మారింది.

వార్షిక ఉద్యోగాల కోత ప్రక్రియ అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అలాంటి వాటిలో ఇన్ ఆఫీస్ అటెండెన్స్ కూడా ఒకటి. కొవిడ్​ మహమ్మారి సమయంలో బ్యాంకు , దాని సహచరులు ఈ నిబంధనను సడలించాయి. కానీ ఇప్పుడు ఆఫీసుకు రాని ఉద్యోగులపై కంపెనీలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

సరైన పర్ఫార్మెన్స్​ లేని వారిని తొలగించేందుకు జేపీ మోర్గాన్​, సిటీ గ్రూప్​ వంటి ఇతర దిగ్గజ సంస్థలు కూడా ఇలాంటి ప్రక్రియనే ఫాలో అవుతుంటాయి.

మహమ్మారి సమయంలో, డీల్ మేకింగ్ రికార్డ్ స్థాయిలను తాకిన సమయంలో గోల్డ్​మన్​ శాక్స తన ఎస్ఆర్ఏ ప్రోగ్రామ్​ని నిలిపివేసింది. 2022 నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

గత ఏడాదితో పోలిస్తే 2024 క్యూ2లో ఇన్​వెస్ట్​మెంట్​-బ్యాంకింగ్ ఆదాయంలో 21 శాతం పెరుగుదల నమోదైందని నివేదిక తెలిపింది. అసెట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారంలో కూడా బ్యాంక్ ఆదాయం 27 శాతం పెరిగింది.

క్యాపిటల్ మార్కెట్లు, ఎంఅండ్ఏ రికవరీ ప్రారంభ ఇన్నింగ్స్​లో ఉన్నామని గోల్డ్​మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ సోలమన్ విశ్లేషకులతో జరిపిన సమావేశంలో పేర్కొన్నారు.

వాస్తవానికి కంపెనీల లేఆఫ్స్​ ప్రక్రియ దాదాపు రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. దీనికి ముగింపు ఎప్పుడు పడుతుందో అని ఉద్యోగులు ఆలోచిస్తున్నారు.

సంబంధిత కథనం