Layoffs in Indian companies: 2023లో 80 శాతానికి పైగా భారతీయ కంపెనీల్లో జీరో లేఆఫ్స్-over 80 percent of indian companies report zero layoffs in 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Layoffs In Indian Companies: 2023లో 80 శాతానికి పైగా భారతీయ కంపెనీల్లో జీరో లేఆఫ్స్

Layoffs in Indian companies: 2023లో 80 శాతానికి పైగా భారతీయ కంపెనీల్లో జీరో లేఆఫ్స్

HT Telugu Desk HT Telugu
Jan 19, 2024 04:02 PM IST

Layoffs in Indian companies: 2023లో కేవలం 22 శాతం భారతీయ కంపెనీలు మాత్రమే తమ ఉద్యోగులను తొలగించాయని హెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థ మెర్సర్ నివేదిక తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Layoffs in Indian companies: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రవేశంతో లక్షలాది మంది ఉద్యోగులకు తొలగింపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. 2023 లో 80 శాతం వరకు భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించే ప్రక్రియ చేపట్టలేదు.

yearly horoscope entry point

ఈ సెక్టార్ నుంచే లే ఆఫ్స్ ఎక్కువ..

హెచ్ఆర్ కన్సల్టింగ్ కంపెనీ మెర్సర్ నివేదిక ప్రకారం 2023లో కేవలం 22 భారతీయ కంపెనీలు మాత్రమే తమ ఉద్యోగులను తొలగించాయి (Layoffs). గత ఏడాది 81% భారతీయ కంపెనీలు జీరో లేఆఫ్స్ ను నివేదించాయి. దాంతో మెజారిటీ భారతీయ మిడ్ సైజ్ సంస్థలు తమ పట్టును నిలుపుకున్నాయని, నియామకాల్లో కనీస తగ్గింపును అమలు చేశాయని స్పష్టమవుతోంది. ఐటీ సర్వీసెస్, కంప్యూటర్ సాఫ్ట్ వేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ లకు చెందిన కంపెనీలు ఎక్కువగా 2023లో తమ ఉద్యోగులను తొలగించాయి.

ఫ్రీలాన్సర్లకు డిమాండ్

దేశవ్యాప్తంగా 20 వేర్వేరు పరిశ్రమలకు చెందిన 1,500 మందికి పైగా హెచ్ఆర్ లీడర్ల నుంచి సమాచారాన్ని సేకరించి, ఈ నివేదికను రూపొందించారు. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో కూడా ఫ్రీలాన్సర్లను నియమించుకునే ధోరణి కొనసాగుతుందని ఈ నివేదిక తెలిపింది. గత ఏడాది 54% హెచ్ ఆర్ లు రిమోట్ వర్కర్లను నియమించుకున్నట్లు నివేదించాయి. అలాగే, 77% మంది హెచ్ఆర్ లీడర్లు ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయని తెలిపారు.

2024 లో..

2024 నియామక ధోరణులపై విశ్లేషిస్తూ.. 2024 లో అన్ని పరిశ్రమలలో ఉద్యోగావకాశాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. "మెరుగైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, కృత్రిమ మేధను స్వీకరించడానికి ఓపెన్ మైండ్ సెట్ ను డెవలప్ చేసుకోవడం ఇప్పుడు ఉద్యోగుల ముందు ఉన్న ప్రధాన సవాలు" అని నివేదిక తెలిపింది.

కంటెంట్ రైటర్ల పరిస్థితి

2024 లో, కంటెంట్ రైటర్ల ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తుందని 51% మంది హెచ్ఆర్ లీడర్స్ చెప్పారు. కస్టమర్ సర్వీస్ ఉద్యోగుల్లో కూడా 46% మందిపై ఏఐ ప్రభావం ఉంటుందని తెలిపారు. దీంతోపాటు ఈ ఏడాది నైపుణ్యాలపై సంస్థలు దృష్టిసారించనున్నాయి. డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్ క్లూజన్ (డీఈఐ)లు హైరింగ్ లో ప్రాధాన్యతాంశంగా ఉంటుందన్నారు. రాబోయే సంవత్సరాల్లో టాలెంట్ అక్విజిషన్ వ్యూహాలను ప్లాన్ చేస్తున్నప్పుడు 68% కంపెనీలు స్త్రీ, పురుష తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని నివేదిక తెలిపింది.

అప్ డేట్ చేసుకోవాల్సిందే..

మునుపెన్నడూ లేని వేగంతో నైపుణ్యాలు నిరుపయోగంగా మారుతున్న ఈ యుగంలో.. రేసులో కొనసాగాలంటే, ఎప్పటికప్పుడు నైపుణ్యాలను అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి. భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండాలి.

Whats_app_banner