Intel layoffs : మరో దిగ్గజ టెక్ కంపెనీలో భారీగా ఉద్యోగాల కోత.. కాస్ట్ కటింగ్ పేరుతో!
మరో రౌండ్ లేఆఫ్స్‌కి ఇంటెల్ సంస్థ సిద్ధమవుతున్నట్టు సమాచారం! ఈసారి వేలాది మందిని ఇంటికి పంపించేందుకు ఇంటెల్ ఏర్పాట్లు చేసుకుంటోంది!
చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కార్పొరేషన్ ఈ వారంలోనే వేలాది మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఆగస్టు 1న అంచనా వేసిన ఫ్లాట్ క్యూ2 ఆదాయాలు, మార్కెట్ వాటా నష్టాలకు టెక్ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నందున ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఉద్యోగ కోత ప్రకటన ఈ వారంలోనే రావచ్చని కంపెనీ ప్రణాళికల గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. లేటెస్ట్ అప్డేట్స్పై ఇంటెల్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
కాస్ట్ కటింగ్ పేరుతో..
ఇంటెల్‌లో దాదాపు 1,10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 2023 మధ్య, ఈ చిప్ తయారీ సంస్థ తన ఉద్యోగుల్లో 5 శాతం మందిని, అంటే 124,800 మందిని తొలగించినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.
కంపెనీ "ఇతర రంగాలలో" ఖర్చును కూడా తగ్గిదిస్తోందని, 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల వరకు ఖర్చులను తగ్గించుకుంటుందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. దీనికి బదులుగా పరిశోధన- అభివృద్ధి (ఆర్ & డీ)లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, కంపెనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రాముఖ్యతకు తిరిగి పొందడనికి ఖర్చు చేయనున్నట్టు ఇంటెల్ సీఈఓ ప్యాట్ గెల్సింగర్ తెలిపారు.
అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ ఇంక్ (ఏఎండీ) వంటి ప్రత్యర్థి కంపెనీలు పుంజుకోవడంతో ఇంటెల్.. తన ఒకప్పటి ఆధిపత్య స్థానం, మార్కెట్ వాటాను కోల్పోతూ వచ్చింది.
అమెరిక స్టాక్ మార్కెట్లో మంగళవారం ట్రేడింగ్‌లో ఇంటెల్ 1 శాతం పెరిగి 31.11 డాలర్లకు చేరుకుంది.
ఇదిలా ఉండగా, ఎన్విడియా కార్పొరేషన్ నేతృత్వంలో కృత్రిమ మేధస్సు సంబంధిత (ఏఐ) పనుల కోసం రూపొందించిన లాభదాయక సెమీకండక్టర్ల అభివృద్ధిలో చిప్ తయారీదారులు ముందడుగు వేశారు.
చిప్ తయారీ ఇంటెల్ ప్రధాన వ్యాపారం. ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లను నడిపింపే చిప్‌లకు అసమాన డిమాండ్ కనిపిస్తున్నందును కంపెనీకి ఇబ్బందులు ఎదరువుతున్నాయని తెలుస్తోంది.
ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి కంపెనీ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని, ఇతర చిప్ మేకర్లకు సెమీకండక్టర్లను తయారు చేయాలని యోచిస్తోంది. మైక్రాన్ టెక్నాలజీ ఇంక్‌కు చెందిన నాగ చంద్రశేఖరన్‌ను చీఫ్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా గత వారం ఇంటెల్ నియమించుకుంది.
గత ఏడాదితో పోలిస్తే ఇంటెల్ క్యూ2 ఆదాయాన్ని ఫ్లాట్‌గా నమోదవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024 ద్వితీయార్థంలో వృద్ధి స్వల్పంగా పుంజుకుంటుందని, మొత్తం అమ్మకాలు 3 శాతం పెరిగి 55.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని వాల్ స్ట్రీట్ అంచనా వేసింది. 2021 తర్వాత ఆదాయం పెరగడం మాట రావడం ఇదే తొలిసారి!
సంబంధిత కథనం