Gold and silver prices today : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​.. మరింత దిగొచ్చిన బంగారం ధర!-gold and silver prices today 26 april 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​.. మరింత దిగొచ్చిన బంగారం ధర!

Gold and silver prices today : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​.. మరింత దిగొచ్చిన బంగారం ధర!

Sharath Chitturi HT Telugu
Apr 26, 2024 05:41 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు ఆల్​ టైమ్​ హై నుంచి వెనక్కి వస్తున్నాయి! శుక్రవారం.. బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. వెండి ధరలు కూడా పడ్డాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 66,240కి చేరింది. గురువారం ఈ ధర రూ. 66,250గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,62,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,624గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 72,260కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,270గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,22,600గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,390గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,410గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,240 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,260గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,090గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,190గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,240గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,260గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,240గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,260గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,290గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,310గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,240గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,260గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,240గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 82,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 82,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 85,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 82,400.. బెంగళూరులో రూ. 83,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 330 పడి.. రూ 24,090కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,420గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,090గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం