Gold rate: రెండు వారాల కనిష్టానికి బంగారం ధరలు; సడెన్ గా తగ్గడానికి కారణాలు ఏంటి?-gold hits 2 week low despite record highs in 2024 whats hurting the appeal ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rate: రెండు వారాల కనిష్టానికి బంగారం ధరలు; సడెన్ గా తగ్గడానికి కారణాలు ఏంటి?

Gold rate: రెండు వారాల కనిష్టానికి బంగారం ధరలు; సడెన్ గా తగ్గడానికి కారణాలు ఏంటి?

HT Telugu Desk HT Telugu

Gold rate: పైపైకి దూసుకుపోతున్న పసిడి ధరలు క్రమంగా కిందికి దిగి వస్తున్నాయి. బుధవారం బంగారం ధరలు రెండు వారాల కనిష్టానికి చేరాయి.

ప్రతీకాత్మక చిత్రం

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం కూడా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1060 దిగొచ్చి.. రూ. 66,600 కి చేరుకుంది. మంగళవారం ఈ ధర రూ. 67,540 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 10600 తగ్గి, రూ. 6,66,000 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,660 గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 1030 తగ్గి.. రూ 72, 650 కి చేరింది. మంగళవారం ఈ ధర 73,680 గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 10300 దిగొచ్చి.. రూ. 7,26,500 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,265 గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,750గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,800గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,650గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర (gold rate) రూ. 67,300గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,420 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,600గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,650 గాను ఉంది.

హైదరాబాద్​లో బంగారం ధరలు

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,600 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,650 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,650గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,700గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,600గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,650 గా ఉంది.

అకస్మాత్తుగా పసిడి ధరలు తగ్గడానికి కారణం..

అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడంతో పసిడి ధరలపై ఆ ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ డ్రోన్ దాడి తరువాత ప్రతీకారం తీర్చుకునే ఆలోచన లేదని ఇరాన్ స్పష్టం చేయడం కూడా బంగారం ధరలు తగ్గడానికి మరో కారణమని వివరించారు. జపాన్ యెన్ తో పోలిస్తే అమెరికా డాలర్ తాజా 34 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టగా, డాలర్ ఇండెక్స్ ఐదు నెలల గరిష్టానికి చేరుకుంది.

వెండి కూడా..

వెండి ధరలు కూడా బుధవారం భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,290 గా ఉంది. మంగళవారం ఈ ధర రూ. 8,540గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 82,900కి చేరింది.

Silver price today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 86,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 82,900.. బెంగళూరులో రూ. 82,500గా ఉంది. హైదరాబాద్ లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 24,420గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)