Gold and silver prices today : ప్చ్​.. మళ్లీ రూ. 67వేల ఎగువకు బంగారం ధర- వెండి రేటు ఇలా..-gold and silver prices today 16th april 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : ప్చ్​.. మళ్లీ రూ. 67వేల ఎగువకు బంగారం ధర- వెండి రేటు ఇలా..

Gold and silver prices today : ప్చ్​.. మళ్లీ రూ. 67వేల ఎగువకు బంగారం ధర- వెండి రేటు ఇలా..

Sharath Chitturi HT Telugu
Apr 17, 2024 08:20 AM IST

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి రేటు కూడా పైకి వెళ్లింది. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు.. (AFP)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 67,060కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 67,050గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,70,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,706గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 73,160కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,150గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,31,600గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,210గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,310గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,060 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,160గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,890గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,060గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,060గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,160గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,060గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,160గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,110గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,210గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,060గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,160గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,610గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 86,100కి చేరింది. సోవారం ఈ ధర రూ. 86,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 89,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 86,100.. బెంగళూరులో రూ. 84,550గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం