Gold and silver price today : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..-gold and silver price today in hyderabad 8th july 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Price Today : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

Gold and silver price today : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

Sharath Chitturi HT Telugu
Jul 08, 2024 05:29 AM IST

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా పడ్డాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 67,640కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 67,650గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,76,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,764గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 73,790గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 73,800గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,37,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,379గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,779గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,940గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,640 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,790గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,190గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,390గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,640గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,790గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,640గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,790గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,690గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,840గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,640గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,790గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

Silver price in Hyderabad : దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,470గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 94,700గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 94,800గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 99,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 94,700.. బెంగళూరులో రూ. 94,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల ప్లాటీనం ధర రూ. 27,600గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,600గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం