Gold and silver price today : స్థిరంగా పసిడి ధరలు.. దిగొచ్చిన వెండి రేటు- నేటి లెక్కలివే-gold and silver price today 1st june 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Price Today : స్థిరంగా పసిడి ధరలు.. దిగొచ్చిన వెండి రేటు- నేటి లెక్కలివే

Gold and silver price today : స్థిరంగా పసిడి ధరలు.. దిగొచ్చిన వెండి రేటు- నేటి లెక్కలివే

Sharath Chitturi HT Telugu
Jun 01, 2024 05:38 AM IST

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు సైతం పడ్డాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 66,690గా ఉంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,66,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,669గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 72,750 వద్ద ఉంది. క్రితం రోజు..కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,27,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,840గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,900గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,690 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,750గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,290గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,410గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,690గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,750గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,690గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,750గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,740గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,280గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,690గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,750గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,540గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 95,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 95,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 99,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 95,400.. బెంగళూరులో రూ. 95,700గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 270 తగ్గి.. రూ. 27,350కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,620గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,350గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం