Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు గురువారం కొంత దిగొచ్చాయి. వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Gold and silver prices today : దేశంలో బంగారం (gold rate) ధరలు గురువారం స్వల్పగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 68,290కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 68,300గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,82,900కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 6,829గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 74,500కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 74,510గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,45,000గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,450గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,440 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,650గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,290 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 74,500గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర (gold rate)రూ. 68,590 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,830గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 68,290గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 74,500గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,290గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,500గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,340గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 74,550గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68,290గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,500గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Silver price today in Hyderabad : దేశంలో వెండి ధరలు గురువారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,590 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 దిగొచ్చి.. రూ. 95,900 కి చేరింది. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఆల్టైమ్ హైకి చేరుకుంది. ఇప్పుడు హైదరాబాద్ లో 10 గ్రాములు వెండి ధర రూ. 10,400 పలుకుతోంది. అంటే, కేజీ వెండి ధర ఆల్ టైం హై అయిన 1,04,000 కి చేరుకుంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 95,900.. బెంగళూరులో రూ. 95,600గా ఉంది. కేరళ, పూణె, పట్నాలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)