Gold and silver prices today : మే 22 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు వివరాలు..-gold and silver prices today 22nd may 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మే 22 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు వివరాలు..

Gold and silver prices today : మే 22 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు వివరాలు..

Sharath Chitturi HT Telugu
May 22, 2024 09:15 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు దిగొచ్చాయి. వెండి ధరలు సైతం పడ్డాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Deepak Salvi )

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 68,290కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 68,300గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,82,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,829గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 74,500కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 74,510గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,45,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,450గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,440గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,650గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,290 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 74,500గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,590గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,830గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 68,290గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 74,500గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,290గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,500గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,340గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 74,550గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68,290గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,500గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

Silver price today in Hyderabad : దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,450గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 దిగొచ్చి.. రూ. 94,500కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 94,600గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 98,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 94,500.. బెంగళూరులో రూ. 92,400గా ఉంది. కేరళ, పూణె, పట్నాలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 

వెండి ధర ఆల్​టైమ్​ హైకి స్వల్ప దూరంలో ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం