Gautam Adani re-enters Forbes: మళ్లీ ఫోర్బ్స్ లిస్ట్ లోకి గౌతమ్ ఆదానీ-gautam adani re enters forbes top 20 richest gains 463 mn ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gautam Adani Re-enters Forbes Top 20 Richest, Gains $463 Mn

Gautam Adani re-enters Forbes: మళ్లీ ఫోర్బ్స్ లిస్ట్ లోకి గౌతమ్ ఆదానీ

HT Telugu Desk HT Telugu
Feb 07, 2023 04:39 PM IST

Gautam Adani re-enters Forbes: గతంలో ప్రపంచ సంపన్నుల్లో తొలి ముగ్గురిలో ఒకరుగా నిలిచిన ఆదానీ గ్రూప్ (Adani Group) చైర్మన్ గౌతమ్ ఆదానీ (Gautam Adani).. ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కంపెనీల షేర్లు కుప్పకూలడంతో ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి తొలగిపోయారు.

ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ
ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ (REUTERS)

Gautam Adani re-enters Forbes: ఆదానీ గ్రూప్ (Adani Group) ఆర్థిక అవకతవకలపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ (Hindenburg Research) రూపొందించిన నివేదిక వెలుగు చూసిన తరువాత ఆదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. వరుసగా వారం రోజుల పాటు లోయర్ సర్క్యూట్ లో ట్రేడ్ అయ్యాయి. సుమారు 120 బిలియన డాలర్ల మేరకు ఆదానీ (Gautam Adani) సంపద ఆవిరయింది. ఈ నేపథ్యంలో ఆయన ఫోర్బ్స్ రూపొందించే జాబితాలో చోటు కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు

Gautam Adani re-enters Forbes: మళ్లీ సంపన్నుల జాబితాలోకి..

తాజాగా, గౌతమ్ ఆదానీ (Gautam Adani) మళ్లీ ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు సంపాదించారు. ఫోర్బ్స్ టాప్ 20 లో ఒకరుగా నిలిచారు. ఫోర్బ్స్ టాప్ 20 లో గౌతమ్ ఆదానీ ప్రస్తుత స్థానం 17గా ఉంది. ఫిబ్రవరి 7 నాటికి ఆదానీ గ్రూప్ (Adani Group) స్టాక్స్ విలువ 463 మిలియన్ డాలర్లు బలపడింది. వాటిలో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) షేరు విలువ ఏకంగా 25% బలపడి రూ. 1965.50 కి చేరింది. ఆదానీ పోర్ట్స్ (Adani Ports) షేర్ విలువ 9.64% బలపడి రూ. 598.70 కి చేరింది. ఆదానీ ట్రాన్స్ మిషన్ (Adani Transmission) షేరు విలువ రూ. 1,324.45 కి, ఆదానీ విల్మర్ (Adani Wilmar) షేరు విలువ రూ. 399.40 కి చేరాయి.

Gautam Adani re-enters Forbes: హిండెన్ బర్గ్ ఎఫెక్ట్

యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ (Hindenburg Research) నివేదిక దేశీయంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆదానీ (Gautam Adani) స్టాక్స్ మేనిప్యులేషన్ కు పాల్పడ్డారని, ఆదానీ గ్రూప్ (Adani Group) షేర్ల విలువను అక్రమ పద్ధతుల్లో కృత్రిమంగా భారీగా పెంచారని, టాక్స్ హెవెన్స్ లో షెల్ కంపెనీల ద్వారా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని హిండెన్ బర్గ్ నివేదిక (Hindenburg Research) ఆరోపించింది. దాంతో, ఆదానీ గ్రూప్ (Adani Group) షేర్ల విలువ ఒక్కసారిగా కుప్పకూలింది.

WhatsApp channel