Adani Group stocks rebound: అనూహ్యంగా పుంజుకున్న ఆదానీ కంపెనీల షేర్లు
Adani Group stocks rebound: ఆదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్ల వరుస పతనాలకు శుక్రవారం ఫుల్ స్టాప్ పడింది. అనూహ్యంగా ఆదానీ గ్రూప్ (Adani Group) కు చెందిన నాలుగు కంపెనీల షేర్లు శుక్రవారం పుంజుకున్నాయి.
Adani Ports shares rebound: 8% పెరిగిన ఆదానీ పోర్ట్స్
మరి కొంతకాలం ఆదానీ కంపెనీల షేర్ల పతనం తప్పదని అంచనాలు వెలువడుతున్న సమయంలో, అనూహ్యంగా శుక్రవారం ఆదానీ గ్రూప్ (Adani Group) లోని నాలుగు కంపెనీల షేర్లు కొంతమేరకు పుంజుకుని మార్కెట్ వర్గాలకు ఆశ్చర్యపర్చాయి. వాటిలో అత్యధికంగా ఆదానీ పోర్ట్స్ (Adani Ports) 8 % పుంజుకోగా, ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) 1.25% మెరుగుపడింది. దాంతో గత ఆరు రోజుల ఆదానీ షేర్ల పతనానికి బ్రేక్ పడింది. శుక్రవారం ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) షేరు బీఎస్సీ (BSE) లో 1.25% మెరుగుపడి, రూ. 1584.20 వద్ద స్థిరపడింది. అలాగే, ఆదానీ పోర్ట్స్ షేరు విలువ 7.98% మెరుగుపడి రూ. 498.85 కి చేరింది. మరోవైపు, అంబుజా సిమెంట్స్ (Ambuja Cements) 6.03% మేర, ఏసీసీ (ACC) 4.39 మేర పుంజుకున్నాయి.
Reason behind rebound: అదేనా కారణం?
ఆదానీ కంపెనీల్లో (Adani Group) పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన టోటల్ ఎనర్జీస్ (Total Energies) సంస్థ నుంచి ఆదానీ గ్రూప్ పై విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రకటన వెలువడిన కారణంగానే ఈ రికవరి ర్యాలీ ప్రారంభమైందని భావిస్తున్నారు. టోటల్ ఎనర్జీస్ (Total Energies) ఫ్రాన్స్ కు చెందిన విద్యుత్ రంగ దిగ్గజ సంస్థ. తాజా వివాదం నేపథ్యంలో, ఆదానీ సంస్థల్లో (Adani Group) పెట్టిన పెట్టుబడులపై ఎలాంటి పున: సమీక్ష జరపడం లేదని శుక్రవారం టోటల్ ఎనర్జీస్ (Total Energies) ప్రకటించడంతో ఆదానీ షేర్లపై మదుపర్ల విశ్వాసం కొంతమేరకు పెరిగినట్లు భావిస్తున్నారు. అయితే,అదే సమయంలో ఆదానీ ట్రాన్స్మిషన్ (Adani Transmission) 10%, ఆదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) 10%, ఆదానీ పవర్ (Adani Power) 5%, ఆదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas) 5%, ఆదానీ విల్మర్ (Adani Wilmar) 4.99%, ఎన్డీటీవీ (NDTV) 4.98% పతనం కావడం గమనార్హం. ఆదానీ గ్రూప్ (Adani Group) లోని చాలా కంపెనీలు గత 6 రోజులుగా లోయర్ సర్క్యూట్ ను టచ్ అవుతున్న విషయం తెలిసిందే.