Gautam Adani : టాప్​-10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్​..!-gautam adani out of top 10 richest list as group stocks decline further ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gautam Adani Out Of Top 10 Richest List As Group Stocks Decline Further

Gautam Adani : టాప్​-10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్​..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 31, 2023 12:11 PM IST

Gautam Adani out of top 10 richest list : టాప్​-10 రిచ్​ లిస్ట్​లో గౌతమ్​ అదానీ పేరు మాయమైపోయింది. అదానీ గ్రూప్​ స్టాక్స్​ పతనం కొనసాగుతుండటం ఇందుకు కారణం.

గౌతమ్​ అదానీ
గౌతమ్​ అదానీ (REUTERS)

Gautam Adani out of top 10 richest list : హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ నివేదిక ఎఫెక్ట్​తో.. ఆసియా కుబేరుడు గౌతమ్​ అదానీ సంపద ఆవిరైపోతోంది! అదానీ గ్రూప్​ స్టాక్స్​ పతనం కొనసాగుతుండటంతో.. ఆ సంస్థ ఛైర్మన్​​ గౌతమ్​ అదానీ.. ప్రపంచ సంపన్నుల టాప్​-10 జాబితాలో స్థానాన్ని కోల్పోయారు.

బ్లూమ్​బర్గ్​ బిలియనీర్స్​ ఇండెక్స్​ ప్రకారం.. 2023 జనవరి 31 నాటికి గౌతమ్​ అదానీ సంపద 84.4 బిలియన్​ డాలర్లుగా ఉంది. అమెజాన్​ బాస్​ జెఫ్ బెజోజ్​ సంపద 124 బిలియన్​ డాలర్లు. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా.. బెర్నార్డ్​ ఆర్నాల్ట్​ కొనసాగుతున్నారు. ఆయన నెట్​ వర్త్​ 189 బిలియన్​ డాలర్లు. ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా, ట్విట్టర్​ ఓనర్​ ఎలాన్​ మస్క్​ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో జెఫ్​ బెజోజ్​ కొనసాగుతున్నారు.

అదానీ గ్రూప్​ స్టాక్స్​లో రక్తపాతం..!

Gautam Adani net worth : హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ నివేదిక ప్రకారం.. అదానీ సంస్థలో ఆర్థికపరమైన అవకతవకలు జరుగుతున్నాయి. ఇతర మార్గాల్లో డబ్బును విదేశాలకు పంపించి, అదానీ స్టాక్స్​ను సంస్థే కొనుగోలు చేస్తోందని నివేదికలో హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ పేర్కొంది. ఫలితంగా అదానీ గ్రూప్​ స్టాక్స్​ను మేనిప్యులేట్​ చేస్తోందని ఆరోపించింది. ఈ నివేదిక నేపథ్యంలో అదానీ స్టాక్స్​లో బుధవారం నుంచి రక్తపాతం కొనసాగుతోంది.​ అప్పటి వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉండే గౌతమ్​ అదానీ.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి 7,8 స్థానాలకు పడిపోయారు. తాజాగా.. టాప్​-10 నుంచి బయటకొచ్చేశారు.

గడిచిన 24 గంటల్లో.. గౌతమ్​ అదానీ 8.21 బిలియన్​ డాలర్ల సంపదను కోల్పోయారు. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 36.1 బిలియన్​ డాలర్ల సంపద ఆవిరైపోయింది.

Adani group stocks crash : ప్రపంచ కుబేరుల సంపదకు సంబంధించి.. ప్రతి రోజు లిస్ట్​ను తయారు చేస్తుంది బ్లూమ్​బర్గ్​. న్యూయార్క్​లో ట్రేడింగ్​ సెషన్​ ముగిసిన అనంతరం ఈ లెక్కలు బయటకొస్తాయి.

భారీగా నష్టం..!

మరోవైపు మంగళవారం కూడా.. పలు అదానీ గ్రూప్​ స్టాక్స్​ లోయర్​ లిమిట్​ను టచ్​ చేశాయి. అదానీ టోటల్​ గ్యాస్​ 10శాతం పతనంతో లోయస్​ సర్క్యూట్​ను తాకింది. అదానీ ఎంటర్​ప్రైజెస్​ 2శాతం పడింది. అదానీ గ్రూప్​నకు చెందిన 10 కంపెనీల విలువ 75 బిలియన్​ డాలర్లు పతనమైంది.

Hindenberg research Adani group : హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ నివేదికను అదానీ గ్రూప్​ ఇప్పటికే ఖండించింది. సంస్థలో అవతకవకలు జరగలేదని 400కుపైగా పేజీలతో కూడిన వివరణను బయటపెట్టింది. అయినప్పటికీ.. అదానీ గ్రూప్​ స్టాక్స్​ పతనం కొనసాగుతుండటం గమనార్హం.

WhatsApp channel

సంబంధిత కథనం