Forbes India: భారత్ లో టాప్ 10 సంపన్నులు వీరే.. రెండో ప్లేస్ లోకి అదానీ-forbes india top 100 richest list mukesh ambani tops adani slips to number 2 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Forbes India: భారత్ లో టాప్ 10 సంపన్నులు వీరే.. రెండో ప్లేస్ లోకి అదానీ

Forbes India: భారత్ లో టాప్ 10 సంపన్నులు వీరే.. రెండో ప్లేస్ లోకి అదానీ

HT Telugu Desk HT Telugu
Oct 12, 2023 01:37 PM IST

Forbes India Top 100 Richest List: ఫోర్బ్స్ ఇండియా మేగజీన్ 2023 సంవత్సరానికి గానూ భారత్ లోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. భారత్ లోని మొత్తం 100 మంది అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ

Forbes India Top 100 Richest List: భారత్ లోని అత్యంత సంపన్నుడి గా మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ నిలిచారు. 2023 ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో.. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ని రెండో స్థానంలోకి నెట్టి అంబానీ మళ్లీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ముకేశ్ అంబానీ సంపద 92 బిలియన్ డాలర్లు.

రెండో స్థానంలో అదానీ

ఫోర్బ్స్ ఇండియా (Forbes India) రూపొందించిన ఈ టాప్ 100 భారతీయ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఉన్నారు. అదానీ - హిండెన్ బర్గ్ అంశం వెలుగులోకి రావడం కన్నా ముందు అదానీనే ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండేవారు. ప్రస్తుతం ఆదానీ నికర సంపద 68 బిలియన్ డాలర్లు. ఈ జాబితాలో సాఫ్ట్ వేర్ టైకూన్ శివ్ నాడార్ మూడో ప్లేస్ లో, సావిత్రి జిందాల్ 4వ స్థానంలో నిలిచారు. టాప్ 10 లో ఉన్న ఏకైక మహిళగా సావిత్రి జిందాల్ నిలిచారు.

టాప్ 10 వీరే..

  • ముకేశ్ అంబానీ - 92 బిలియన్ డాలర్లు
  • గౌతమ్ అదానీ - 68 బిలియన్ డాలర్లు
  • శివ్ నాడార్ - 29. 3 బిలియన్ డాలర్లు
  • సావిత్రి జిందాల్ - 24 బిలియన్ డాలర్లు
  • రాధాకిషన్ దామానీ - 23 బిలియన్ డాలర్లు
  • సైరస్ పూనావాలా - 20.7 బిలియన్ డాలర్లు
  • హిందూజా ఫ్యామిలీ - 20 బిలియన్ డాలర్లు
  • దిలీప్ సాంఘ్వీ - 19 బిలియన్ డాలర్లు
  • కుమరమంగళం బిర్లా - 17.5 బిలియన్ డాలర్లు
  • షాపూర్ మిస్త్రీ అండ్ ఫ్యామిలీ - 16.9 బిలియన్ డాలర్లు

హరూన్ ఇండియా లిస్ట్

రెండు రోజుల క్రితమే భారత్ లోని అత్యంత సంపన్నుల జాబితాను హరూన్ విడుదల చేసింది. దాదాపు ఆ జాబితాలో కూడా టాప్ 10 లో వీరే ఉన్నారు. కానీ, మూడోస్థానంలోకి సైరస్ పూనావాలా వచ్చారు.

Whats_app_banner