EPF withdrawal claim : ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది?
EPF withdrawal claim : ఈపీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్ సెటిల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
EPF withdrawal claim status : ఈపీఎఫ్ ఖాతాల నుంచి ఉపసంహరణ క్లెయిమ్ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు సమస్యలను ఎదుర్కొంటున్నారా? రిక్వెస్ట్‌ని సమర్పించిన తర్వాత ఎటువంటి అప్డేట్ లేదా? మీరొక్కరే ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం లేదని గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సభ్యులు తమ ఫిర్యాదులను సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. ఉపసంహరణ క్లెయిమ్ అప్డేట్ల గురించి ప్రజల ఆందోళనలను నివృత్తి చేస్తూ.. ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టింది.
"సాధారణంగా క్లెయిమ్ని పరిష్కరించడానికి లేదా పీఎఫ్ మొత్తాన్ని విడుదల చేయడానికి 20 రోజుల సమయం పడుతుంది," అని ఈపీఎఫ్ఓ తెలిపింది.
ఒకవేళ 20 రోజుల్లోగా ఈపీఎఫ్ క్లెయిమ్ పూర్తవ్వకపోతే.. సంబంధిత వ్యక్తులు.. ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
EPF withdrawal claim online : "దయచేసి మీ ఫిర్యాదును http://epfigms.gov.in నమోదు చేయండి. మీరు http://epfigms.gov.in మీ గ్రీవియెన్స్ స్టేటస్‌ని ట్రాక్ చేయవచ్చు," అని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
ఇదీ చూడండి:- EPFO details in Telugu: తెలుగులో ఈపీఎఫ్ అకౌంట్ వివరాలను తెలుసుకోవాలా?.. ఇలా చేయండి..
ఈపీఎఫ్ క్లెయిమ్ ఎలా దాఖలు చేయాలి?
- మీ క్లెయిమ్ టైప్ ఫామ్‌ని ఎంచుకోండి. దానిని పూర్తి చేయండి.
- ఈపీఎఫ్ ఉపసంహరణకు అర్హత ప్రమాణాలను పరిశీలించండి.
- ఫామ్ పూర్తిగా, సరిగ్గా ఫిల్ చేశారో లేదో చెక్ చేయండి. క్యాన్సిల్డ్ చెక్, ఐడీ ప్రూఫ్, చిరునామా రుజువు, ఇతర సంబంధిత పత్రాలను జతచేయండి.
- నో యువర్ కస్టమర్ (కేవైసీ) డేటా- ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేయండి.
- వీటిని ఈపీఎఫ్ ఖాతాకు కూడా కనెక్ట్ చేసి నామినేషన్, మెంబర్ ప్రొఫైల్ అప్డేట్ అయినట్లు నిర్ధారించుకోవాలి.
మీ యూఏఎన్ నెంబర్ తెలుసా?
EPF withdrawal claim time : యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) అనేది.. ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) చందాదారులందరికీ లభించే ఒక గుర్తింపు సంఖ్య. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పాన్ ఎలాగో.. ఉద్యోగులకు ఈ యూఏఎన్ అలాగ!
బహుళ యజమానులను కలిగి ఉన్న ఈపీఎఫ్ చందాదారుల కోసం ఒక సాధారణ గుర్తింపు ఐడీలగా పనిచేస్తుంది ఈ యూఏఎన్. చందాదారులు అనేక మంది యజమానులు ఇచ్చిన అనేక సభ్య ఐడీలను కలిగి ఉండవచ్చు కాని ఒక యూఏఎన్ మాత్రమే ఉంటుంది.
ఈపీఎఫ్ వెబ్సైట్లో యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమ ఖాతాకు సంబంధించిన సమస్త సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం