Hyundai Exter On Road Price in Hyderabad : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..-check out on road price of hyundai exter in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter On Road Price In Hyderabad : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Hyundai Exter On Road Price in Hyderabad : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu
Mar 18, 2024 12:50 PM IST

Hyundai Exter On Road Price : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ కొనే ప్లాన్​లో ఉన్నారా? అయితే.. హైదరాబాద్​లో ఎక్స్​టర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..
హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

Hyundai Exter On Road Price Hyderabad : తక్కువ ధరకే, ఎక్కువ ఫీచర్స్​ ఉండే ఎస్​యూవీ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ.. మీకి ది బెస్ట్​ ఆప్షన్​ అవుతుంది? గతేడాది లాంచ్​ అయిన ఈ ఎస్​యూవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్​లో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఈఎక్స్​- రూ. 7,39,742

ఈఎక్స్​ ఓపీటీ- రూ. 7.82 లక్షలు

ఎస్​ - రూ. 9.02 లక్షలు

ఎస్​ ఓపీటీ- రూ. 9.20 లక్షలు

ఎస్​ ఏఎంటీ- రూ. 9.88 లక్షలు

ఎస్​ఎక్స్​- రూ. 9.88 లక్షలు

ఎస్​ సీఎన్​జీ- రూ. 10.12 లక్షలు

Hyundai Exter on road price : ఎస్​ఎక్స్​ డీటీ- రూ. 10.17 లక్షలు

ఎస్​ ఎక్స్​ ఓపీటీ- రూ. 10.64 లక్షలు

ఎస్​ఎక్స్​ ఏఎంటీ- రూ. 10.67 లక్షలు

ఎస్​ఎక్స్​ డీటీ ఏఎంటీ- రూ. 10.97 లక్షలు

ఎస్​ఎక్స్​ సీఎన్​జీ- రూ. 10.98 లక్షలు

ఎస్​ఎక్స్​ ఓపీటీ ఏఎంటీ- రూ. 11.43 లక్షలు

ఎస్​ఎక్స్​ ఓపీటీ కనెక్ట్​- రూ. 11.45 లక్షలు

ఎస్​ఎక్స్​ ఓపీటీ కనెక్ట్​ డీటీ- రూ. 11.62 లక్షలు

ఎస్​ఎక్స్​ ఓపీటీ కనెక్ట్​ ఏఎంటీ- రూ. 11.96 లక్షలు

ఎస్​ఎక్స్​ ఓపీటీ కనెక్ట్​ డీటీ ఏఎంటీ- రూ. 12.71 లక్షలు

Hyundai Exter SUV : అంటే.. హైదరాబాద్​లో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 7.39 లక్షలు- రూ. 12.7 లక్షల మధ్యలో ఉంటుంది. ఇక సీఎన్​జీ అని చెప్పినవి మినహాయిస్తే, ఈ ఎస్​యూవీలో అన్ని పెట్రోల్​ వేరియంట్లే ఉన్నాయి. డీజిల్​ వేరియంట్​ను సంస్థ లాంచ్​ చేయలేదు. హ్యుందాయ్​ ఎక్స్​ ఓపీటీ, ఎస్​ఎక్స్​ సీఎన్​జీ వేరియంట్లు.. బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్నాయి.

సాధారణంగా.. ఏదైనా కారును లాంచ్​ చేసే సమయంలో.. దాని ఎక్స్​షోరూం ధరను మాత్రమే చెబుతుంది సంబంధిత ఆటోమొబైల్​ సంస్థ. కానీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. ఎక్స్​షోరూం ప్రైజ్​తో పాటు వెహికిల్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ని పరిగణలోకి తీసుకుని.. బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోవాలి. పైగా.. మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​కి వెళితే.. ఆ సమయంలో వెహికిల్​పై ఏవైనా ఆఫర్స్​ ఉన్నాయా? అన్న విషయం కూడా తెలుస్తుంది. అది మీకు ఉపయోగపడొచ్చు. మీ బడ్జెట్​ మరింత తగొచ్చు.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఇంజిన్​..

Best selling SUVs in India 2024 : 2023లో లాంచ్​ అయిన హ్యుందాయ్​ ఎక్స్​టర్​లో.. ప్రొజెక్టర్​ హాలోజెన్​ హెడ్​ల్యాంప్స్​, హెచ్​ షేప్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, గ్లాస్​ బ్లాక్​ గ్రిల్​, రూఫ్​ రెయిల్స్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​ వంటివి ఉంటాయి. ఇందులో 15 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​ సైతం వస్తున్నాయి.

ఈ ఎస్​యూవీలో 1.2 లీటర్​ ఇన్​లైన్​ 4 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 88 హెచ్​పీ పవర్​ని, 113.8 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం