Buy or rent a house : సొంత ఇల్లు కొనుక్కోవడం బెటరా? అద్దె ఇంట్లో ఉండాలా?-buy or rent house in hyderabad which is better find out important factors ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Buy Or Rent House In Hyderabad? Which Is Better? Find Out Important Factors

Buy or rent a house : సొంత ఇల్లు కొనుక్కోవడం బెటరా? అద్దె ఇంట్లో ఉండాలా?

Sharath Chitturi HT Telugu
Mar 02, 2024 11:11 AM IST

Buy or rent a house in Hyderabad : సొంత ఇల్లు కొనాలా? లేక రెంట్​ ఇంట్లో ఉండాలా? అని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? అయితే ఇది మీకోసమే..

సొంత ఇల్లు కొనుక్కోవడం బెటరా? అద్దె ఇంట్లో ఉండాలా?
సొంత ఇల్లు కొనుక్కోవడం బెటరా? అద్దె ఇంట్లో ఉండాలా?

Buy or rent a house which is better : సొంత ఇల్లు కొనడం బెటరా? అద్దె ఇంట్లో ఉండటం బెటరా? అన్న టాపిక్​పై చాలా కాలం నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై జెరోధా సీఈఓ నితిన్​ కామత్​ ఇటీవలే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నానని, సొంత ఇల్లును కొనడం కన్నా అద్దె ఇంట్లో ఉండడానికే ఇష్టపడతానని ఆయన చెప్పారు. కానీ సొంత ఇల్లు కొనడటం అనేది ఎమోషన్స్​తో ముడిపడిన విషయం. చాలా మంది డ్రీమ్​! మరి.. అసలు సొంత ఇల్లును కొనాలా? లేక రెంట్​ ఇంట్లో ఉండాలా? ఈ రెండింట్లో ఉన్న పాజిటివ్స్​, నెగిటివ్స్​, రిస్క్​లు ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

ఇల్లు కొనే ముందు ఆలోచించాల్సిన అంశాలు..

డౌన్​ పేమెంట్​:- ఒక ఇల్లు తీసుకోవడానికి మనం ముందుగా కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అదే డౌన్​ పేమెంట్​. సాధారణంగా ఇది ఎక్కువగానే ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని చాలా మంది లోన్​ రూపంలో చెల్లిస్తారు.

ఇంటి లోన్​పై వడ్డీ:- ఇంటి మొత్తం వాల్యూలో కనీసం 10శాతం డౌన్​పేమెంట్​ చేస్తే, మిగిలిన 90శాతాన్ని లోన్​ రూపంలో కడుతూ ఉంటారు. ప్రస్తుత సమయంలో వడ్డీ రేట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ టైమ్​లో లోన్​ తీసుకుంటే.. వడ్డీ భారం కూడా ఎక్కువగానే ఉంటుంది.

అయితే.. అద్దె ఇంట్లో ఉంటే.. ఓనర్​కి రెంట్​ కట్టాలి. లోన్​ తీసుకుని ఇల్లు కొనుక్కుంటే.. వడ్డీ రూపంలో బ్యాంక్​కి రెంట్​ కట్టాలి!

Rented house vs own house : నిర్వహణ ఖర్చులు:- ఇంటికి మీరే ఓనర్​ కాబట్టి.. ఎప్పుడు, ఏం జరిగిన మీరే రిపేర్​ చేయించాల్సి వస్తుంది. చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు.. ఆ ఖర్చులు మీరే బరించాలి. దీనిని పక్కనపెట్టడం కష్టం.

అద్దె ఇంట్లోకి వెళ్లే ముందు పరిగణించాల్సిన విషయాలు..

రెంట్​:- అద్దె ఇంట్లో చాలా కీలకమైన విషయం ఈ రెంట్​! ఓనర్​కి మనం కట్టే అమౌంట్​ ఇది. మెట్రో నగరాల్లో.. 2,3 నెలల అద్దెని డిపాజిట్​ రూపంలో తీసుకుంటారు. హైదరాబాద్​లో సగటున 2 నెలల అద్దెను అడ్వాన్స్​గా ఇవ్వాలి. రెంట్​తో పాటు అడ్వాన్స్​ని కూడా పరిగణించాలి. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు అమౌంట్​ రీఫండ్​ చేసేస్తారు.

అయితే.. సొంత ఇంటి డౌన్​ పేమెంట్​ కన్నా రెంట్​ తక్కువగానే ఉంటుంది.

ఇతర ఖర్చులు:- కరెంట్​ బిల్లులు, వాటర్​ బిల్లులు, మెయిన్​టేన్స్​ ఖర్చులు ఉంటాయి.

రెంటల్​ యీల్డ్​ అంటే ఏంటి?

Own house vs rent house : రెంట్​కి ఉండేవారి కన్నా.. ఇంటి ఓనర్​కి ఇది చాలా ముఖ్యమైనది ఈ రెంటల్​ యీల్డ్​. ఏడాది కాలంలో.. ప్రాపర్టీపై రెంటల్​ ఆదాయం ఎంత వస్తోంది? అది ప్రాపర్టీ వాల్యుతో పోల్చితే ఎలా ఉంది? అనేది ఈ రెంటల్​ యూల్డ్​. ప్రాపర్టీ వాల్యూని రెంటల్​ ఆదాయంతో డివైడ్​ చేసి 100తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది.

ఉదాహరణకు.. మీరు ఒక 3 బీహెచ్​కే రూమ్​ని రూ. 5కోట్లు పెట్టి కొన్నారు అనుకుందాము. దానిని ప్రతి నెల రూ. 65వేలకు అద్దెకి ఇచ్చారు. అంటే.. మీ రెంటల్​ యీల్డ్​ 1.56శాతం.

రెంటల్​ యూల్డ్​ అనేది.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. సాధారణంగా అది 2-3శాతం మధ్యలో ఉంటుంది. ఢిల్లీలో రెంటల్​ యీల్డ్​ 3శాతంగా ఉంటుంది. ఇక హైదరాబాద్​లో రెంటల్​ యూల్డ్​ ఏకంగా 3.88శాతంగా ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి.

సొంత ఇల్లు కొంటే వచ్చే రిస్క్​..

దీర్ఘకాలం పాటు అప్పులు తల మీద ఉంటాయి. సొంత ఇల్లు ఉంటే సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. లోన్​లో తీసుకుంటే.. జీతంలో చాలా వరకు ఈఎంఐలు కట్టడానికే అయిపోతుంది. ఒక్కసారి ఈఎంఐ స్కిప్​ అయితే.. ఇక వడ్డీ భారం మరింత పెరుగుతుంది. ఇది మీ సిబిల్​ స్కోర్​ని ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తులో ఏదైనా లోన్​ తీసుకోవాలని ప్రయత్నిస్తే దొరకకపోవచ్చు. లేదా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

ఇల్లు అనేది నాన్​-మూవెబుల్​ అసెట్​. ఒకసారి కొంటే చాలా సంవత్సరాలు అందులో ఉండాలి. ఈలోపు మీరు ఉద్యోగం మారాల్సి వస్తే, ఇంటిని వదిలేయాలి. ఆ తర్వాత రెంట్​కి ఇవ్వాలి. ఏది ఏమైనా.. నిర్వహణ ఖర్చులు ఉంటూనే ఉంటాయి.

ఇల్లును రెంట్​కి తీసుకుంటే..

Rental yield in Hyderabad : ఇల్లును రెంట్​కి తీసుకుంటే.. ఉద్యోగం మారినా పెద్దగా ఎఫెక్ట్​ పడదు. మూవ్​ అవ్వొచ్చు.

హౌజింగ్​ మార్కెట్​, ఫైనాన్స్​లు ఎక్కువగా ఉన్నప్పుడు.. ఇల్లును రెంట్​కి తీసుకోవడమే బెటర్​. అదే చవకగా ఉంటుంది. మన మీద ఆర్థిక భారం పడదు.

ఎమోషనల్​ ఫ్యాక్టర్​..

సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా మందికి ఒక డ్రీమ్​. ఆ కలను సాకారం చేసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆర్థిక స్తోమత సహకరిస్తే, ఇల్లు కొనుగోలు చేసుకోవడంలో తప్పు లేదు. పైగా.. దీర్ఘకాలంలో దాని వాల్యూ పెరిగితే, ఈ నెట్​ అసెట్​ వాల్యూ కూడా పెరుగుతుంది. కానీ ఫైనాన్షియల్స్​ వీక్​గా ఉండి, ఇల్లు కొనాలని చూస్తేనే సమస్యలు వస్తాయి. ఈ సమయంలో.. ఇల్లు రెంట్​కి తీసుకుని, మిగిలే డబ్బులను ఇన్​వెస్ట్​ చేస్తూ వెళితే, ఒక రోజు.. మీరు కచ్చితంగా సొంత ఇంటిని కట్టుకోవచ్చు.

మరీ ముఖ్యంగా.. 20ఏళ్ల వయస్సులో ఉన్న వారు ఇల్లు కొనడం అనేది చాలా భారం! అప్పుడప్పుడే ఉద్యోగంలోకి వస్తూ, ఫైనాన్షియల్స్​ ఇంకా సెట్​ అవ్వకుండానే ఇల్లు, ల్యాండ్​ కొనడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ ఉద్యోగం పోయినా, వదిలేయాలని అనుకున్నా.. తల మీద ఉన్న అప్పు భారం గుర్తొచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం