Adani debt exposure to banks : భారత దేశ బ్యాంకులకు అదానీ గ్రూప్​ ఎంత అప్పు ఉంది?-adani debt exposure to banks how much does he owe indian banks and is it cautionary ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Adani Debt Exposure To Banks : భారత దేశ బ్యాంకులకు అదానీ గ్రూప్​ ఎంత అప్పు ఉంది?

Adani debt exposure to banks : భారత దేశ బ్యాంకులకు అదానీ గ్రూప్​ ఎంత అప్పు ఉంది?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 29, 2023 11:55 AM IST

Adani debt exposure to banks : వ్యాపార ప్రపంచంలో అదానీ గ్రూప్​పైనే ఇప్పుడు చర్చంతా! హిన్​డెన్​బర్గ్​ నివేదికతో అదానీ గ్రూప్​పై ఫోకస్​ పడింది. ఈ క్రమంలో భారత బ్యాంకింగ్​ వ్యవస్థపై ఆందోళనలు మొదలయ్యాయి. ఇంతకీ.. భారత దేశ బ్యాంకులకు అదానీ గ్రూప్​ ఎంత అప్పు ఉంది?

బ్యాంకులకు అదానీ ఎంత అప్పు ఉన్నారు?
బ్యాంకులకు అదానీ ఎంత అప్పు ఉన్నారు? (AP)

Adani debt exposure to Indian banks : అదానీ గ్రూప్​ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్న హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ నివేదిక.. వ్యాపార ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదానీ స్టాక్స్​ భారీగా పతమయ్యాయి. మదుపర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ వార్తల మధ్య.. దేశంలోని బ్యాంకింగ్​ వ్యవస్థపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అదానీతో దేశీయ బ్యాంకలకు ఎంత ముప్పు పొంచి ఉందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి.. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్​లు సానుకూల సమాధానం ఇస్తున్నాయి. దేశీయ బ్యాంకుల ద్వారా అదానీ గ్రూప్​ తీసుకున్న రుణాలు తక్కువేనని, అవి 'మేనేజెబుల్​ లిమిట్స్​'లోనే ఉన్నాయని జెఫ్రీస్​, సీఎల్​ఎస్​ఏ పేర్కొన్నాయి.

అదానీ గ్రూప్​ అప్పులు..

అదానీ గ్రూప్​ తీసుకున్న అప్పులు.. గత మూడేళ్లల్లో రెట్టింపు అయ్యాయి. రూ. 1లక్ష కోట్ల నుంచి రూ. 2లక్షల కోట్లకు చేరాయి. బ్యాంక్​ల నుంచి తీసుకున్న అప్పులు 25శాతం పెరిగాయని సీఎల్​ఎస్​ఏ వెల్లడించింది. మొత్తం మీద.. అదానీ అప్పుల్లో ఇండియన్​ బ్యాంకుల వాటా 40శాతం కన్నా తక్కువగానే ఉందని వివరించింది.

Adani debt exposure to banks : "అదానీ గ్రూప్​ రుణాల్లో భారత దేశ బ్యాంకుల వాటా 40శాతం కన్నా తక్కువగానే ఉంది. అందులో ప్రైవేటు బ్యాంకుల వాటా 10శాతం కన్నా తక్కువ. ఎయిర్​పోర్ట్​, పోర్ట్​ వంటి ఫైనాన్సియల్​ అసెట్స్​తో కూడిన వ్యాపారలకే అధికంగా రుణాలు ఇచ్చినట్టు ఐసీఐసీఐ, యాక్సిస్​ బ్యాంక్​ వంటి ప్రైవేటు బ్యాంకులు చెబుతున్నాయి. అందువల్ల.. బ్యాంకింగ్​ వ్యవస్థపై అదానీ అప్పుల ప్రభావం తక్కువే," అని సీఎల్​ఎస్​ఏ పేర్కొంది.

పీఎస్​యూ బ్యాంక్​లపై అదానీ అప్పుల ప్రభావం 30శాతంగా ఉంది. కానీ గత ముడేళ్లల్లో ఈ అప్పులు పెద్దగా పెరగలేదు. అంటే.. అదానీ కొత్త, పాత వ్యాపారాలకు విదేశాల నుంచే ఎక్కువగా నిధులు అందాయని సీఎల్​ఎస్​ఏ వివరించింది.

Hindenburg report on Adani group : అదానీ గ్రూప్​ అప్పుల్లో భారత దేశ బ్యాంక్​ల వాటా తగ్గుతూ వస్తోందని సీఎల్​ఎస్​ఏ పేర్కొంది. గత మూడేళ్లల్లో అదానీ గ్రూప్​ కంపెనీలు తీసుకున్న రూ. 1లక్ష కోట్ల అప్పుల్లో ఇండియన్​ బ్యాంక్స్​ వాటా రూ. 15వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఏసీసీ, అంబుజా వంటి సంస్థల కొనుగోళ్ల కోసం.. అదానీ బృందం విదేశీల నుంచే ఎక్కువగా డబ్బులు తెచ్చుకుందని పేర్కొంది.

'మేనేజ్​ చేసేయొచ్చు..!'

భారత దేశంలోని బ్యాంకులు ఇచ్చిన అన్ని అప్పులతో పోల్చి చూస్తే.. అదానీ గ్రూప్​ వాటా 0.5శాతంగా ఉందని ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థ జెఫ్రీస్​ వెల్లడించింది. ఇందులో.. పబ్లిక్​ సెక్టార్​ బ్యాంక్​ వాటా 0.7శాతం, ప్రైవేట్​ సెక్టార్​ వాటా 0.3శాతం అని పేర్కొంది.

Adani stocks crash : "అదానీ గ్రూప్​ కంపెనీల కన్సాలిడేటెడ్​ గ్రాస్​ డెట్​ రూ. 1.9 ట్రిలియన్​గాను, నెట్​ డెట్​ రూ. 1.6 ట్రిలియన్​గాను ఉంది. అదానీ గ్రీన్​ ఎనర్జీ, అదానీ పవర్​, అదానీ పోర్ట్స్​ వ్యాపారాల్లోనే అత్యధిక అప్పులు ఉన్నాయి. వీటిల్లో నెట్​ డెట్​ రూ. 300- రూ. 400 బిలియన్​గా ఉంది. కానీ ఈ కంపెనీల క్యాష్​ఫ్లో మెరుగ్గానే ఉంది," అని జెఫ్రీస్​ స్పష్టం చేసింది.

అదానీ గ్రూప్​తో వచ్చే ముప్పుపై ప్రభుత్వ ఆధారిత బ్యాంకులు ఇప్పటికే స్పందించాలి. ఆర్​బీఐ పెట్టిన లిమిట్​లోనే.. తాము అదానీ గ్రూప్​నకు రుణాలు ఇచ్చామని, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని వివరించాయి.

నివేదికలో ఏముంది..?

Adani on Hindenburg's report : అదానీ గ్రూప్​ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి.. ఓ సంచలన నివేదికను బయటపెట్టింది అమెరికాకు చెందిన ఇన్​వెస్ట్​మెంట్​ ఫర్మ్​ హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​. అదానీ గ్రూప్​లో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వివరించింది. అంతా బాగానే ఉందని బయట ప్రపంచానికి చూపించుకునేందుకు.. అదానీ సిబ్బంది తప్పుడు మార్గాల్లో అడుగులు వేసిందని వివరించింది. ఫలితంగా.. అదానీ గ్రూప్​ స్టాక్స్​పై తాము షార్ట్​- సెల్లింగ్​వైపు ఉంటామని స్పష్టం చేసింది.

ఫలితంగా.. అదానీ గ్రూప్​ స్టాక్స్​లో.. శుక్రవారం ఒక్క రోజే మదుపర్లు రూ. 3.9 ట్రిలియన్​ పోగొట్టుకోగా.. బుధవారాన్ని కూడా కలుపుకుంటే.. ఆ సంఖ్య రూ. 4.4 ట్రిలియన్​కు చేరుతుంది!

Whats_app_banner

సంబంధిత కథనం