4K Smart Tv : 85 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్.. థియేటర్‌లాంటి ఫీల్.. ధర ఎంతంటే?-85 inch new elista smart tv launch feel like theatre in house know what is the price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  4k Smart Tv : 85 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్.. థియేటర్‌లాంటి ఫీల్.. ధర ఎంతంటే?

4K Smart Tv : 85 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్.. థియేటర్‌లాంటి ఫీల్.. ధర ఎంతంటే?

Anand Sai HT Telugu
Oct 14, 2024 06:30 PM IST

4k Smart Tv : ఎలిస్టా 85 అంగుళాల స్మార్ట్ టీవీ భారత్‌లో లాంచ్‌ అయింది. ఈ టీవీలో డాల్బీ ఆడియో సపోర్ట్‌తో స్పీకర్లు లభిస్తాయి. హెచ్‌డీఆర్ 10 సపోర్ట్‌తో 4కె ప్యానెల్‌తో వస్తుంది.

85 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్
85 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్

ఎలిస్టా భారతదేశంలో కొత్త 85 అంగుళాల స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఈ కేటగిరీలో అత్యంత సరసమైన స్మార్ట్ టీవీ అవ్వనుంది. హెచ్‌డీఆర్ 10 సపోర్ట్‌తో 4కే ప్యానెల్ ఉన్న ఈ టీవీ గూగుల్ టీవీలో రన్ అవుతుంది. ఎలిస్టా 85 అంగుళాల టీవీ బెజెల్ లెస్ డిజైన్‌తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్ ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్‌తో స్పీకర్లు ఉన్నాయి. ఎలిస్టా 85 అంగుళాల గూగుల్ టీవీ ఇన్‌బిల్ట్ క్రోమ్ కాస్ట్ ను కలిగి ఉంది. ఇది వినియోగదారులు సినిమాలు, షోలు, ఫోటోలు, మరెన్నో నేరుగా వారి టీవీకి స్ట్రీమ్ చేయడానికి అనుమతిస్తుంది.

ఎలిస్టా 85 అంగుళాల గూగుల్ టీవీలో 4కే రిజల్యూషన్, హెచ్‌డీఆర్ 10 సపోర్ట్ ఉన్నాయి. ఇది బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంది. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో స్పీకర్లు ఉంటాయి. ఇది బిల్ట్-ఇన్ క్రోమ్కాస్ట్ ఫీచర్‌ను కలిగి ఉంది. వినియోగదారులను వారి ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ నుండి నేరుగా టెలివిజన్‌కు స్ట్రీమ్ చేయడానికి అనుమతిస్తుంది.

5 గిగాహెర్ట్జ్ / 2.4 గిగాహెర్ట్జ్ డ్యూయల్-బ్యాండ్ వై-ఫైను అందిస్తాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్, కనెక్టివిటీ కోసం హెచ్‌డీఎంఐ, యూఎస్బీ పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలో వాయిస్ కమాండ్స్‌తో డివైస్‌ను కంట్రోల్ చేయడానికి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఉపయోగపడుతుంది. ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూఎస్బీ ఆప్షన్, యూట్యూబ్ కోసం హాట్కీ రిమోట్‌తో వస్తుంది.

ఎలిస్టా 85 అంగుళాల టీవీ ఇండియా ధర చూసుకుంటే.. రూ.1,60,900గా ఉంది. దేశవ్యాప్తంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎలక్ట్రానిక్స్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొత్త 85-అంగుళాల వేరియంట్ ఎలిస్టా ప్రస్తుత గూగుల్ టీవీ లైనప్‌లో చేరుతుంది.

Whats_app_banner