Indian Rupee : ఈ దేశంలో ఇండియా ఒక్క రూపాయి రూ.500 సమానం.. కానీ పెట్రోల్ ధర కప్పు టీ కంటే తక్కువ
Indian Rupee : భారతదేశం ఒక్క రూపాయికి 500 రూపాయలు ఇచ్చే దేశం గురించి మీకు తెలుసా? కొన్ని దేశాల్లో భారత రూపాయి విలువ ఎక్కువగానే ఉంది. కానీ అక్కడ పెట్రోల్ ధరలు మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి.
గ్లోబల్ ఎకనామిక్ మార్కెట్‌లో ఒక్కో దేశం డబ్బుకు ఒక్కో విలువ ఉంటుంది. అంటే ఒక US డాలర్ 83 భారతీయ రూపాయలు. ఆ వరుసలో ఒక్క రూపాయికి ఇండియా 500 రూపాయలు ఇచ్చే దేశం కూడా ఉంది. ఇది మరే ఇతర దేశం కాదు ఇరాన్. అయితే ఇక్కడ పెట్రోల్ మాత్రం టీ కప్పు ధర కంటే తక్కువగా ఉంటుంది.
ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు, అయినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్ ఆ దేశంపై సంవత్సరాలుగా అనేక ఆర్థిక ఆంక్షలు విధించింది. దేశ కరెన్సీ విలువ ఇంత దారుణంగా ఉండడానికి ఇదే కారణం. అందుకే ఇరాన్‌లో ఒక భారతీయ రూపాయి ఆ దేశంలోని 500 రూపాయలతో సమానం.
కరెన్సీ విలువ తక్కువే
ఇరాన్ ఆర్థికంగా పటిష్టంగా ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలు ఇచ్చిన తీవ్ర సంక్షోభంతో ఆ దేశ కరెన్సీ విలువ అట్టడుగు స్థాయికి చేరుకుంది. అంతేకాకుండా ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా అమెరికా భయంతో చాలా దేశాలు ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు కూడా భయపడతాయి. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం ప్రారంభించింది. అందుకే మన రూపాయి అక్కడ విలువ ఎక్కువగా ఉంది.
ఇరాన్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉన్నప్పటికీ ఎప్పటి నుంచో ఇరాన్ తో భారత్ సత్సంబంధాలు కొనసాగించడం గమనార్హం. అలాగే ఇండియన్ కరెన్సీలో 10,000 రూపాయలతో ఇరాన్ టూర్ కి వెళ్లి విలాసంగా ఉంటూ హాయిగా ప్రయాణం చేయవచ్చు.
అమెరికాతో శత్రుత్వం
భారత్‌తో సహా కొన్ని దేశాలు మాత్రమే తమ స్థానిక కరెన్సీలో ఇరాన్‌తో వ్యాపారం చేయడం గమనార్హం. యుఎస్‌తో కొనసాగుతున్న శత్రుత్వాల కారణంగా, ఈ దేశంలో యుఎస్ డాలర్ అంగీకరించబడదు. ముఖ్యంగా ఈ దేశంలో US డాలర్లను కలిగి ఉండటం చాలా పెద్ద నేరం. ఈ కారణంగా ఇరాన్‌లో US డాలర్లను స్మగ్లింగ్ చేసే పరిశ్రమ పెరుగుతోంది.
పెట్రోల్ ధర తక్కువ
ఇక పెట్రోల్ గురించి చూసుకుంటే ఈ దేశంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇరాన్‌లో ఒక కప్పు టీకి లీటర్ పెట్రోల్ ధర కూడా చాలా తక్కువగా ఉంది. అంతర్జాతీయ పెట్రోల్ ధరల ప్రకారం ఇరాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.2.38, లిబియాలో రూ.2.57, వెనిజులాలో రూ.2.92గా ఉంది. నాలుగు దేశాల్లో లీటర్ పెట్రోల్ రూ.30 లోపే అమ్ముతున్నారు. రెండు దేశాల్లో రూ.40 లోపు, ఆరు దేశాల్లో రూ.41 నుంచి రూ.50 వరకు ఉన్నాయి.
ప్రపంచంలోని 80 దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100-150గా ఉంది. 26 దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.151 నుంచి రూ.190.83 వరకు ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెట్రోల్ ధర రూ.270.28 ఉన్న దేశం హాంకాంగ్ మాత్రమే.
ముడిచమురు విషయానికొస్తే అది ఇప్పటికీ బ్యారెల్ కు 90 డాలర్ల దిగువనే ఉంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి పెట్రోల్ ధరలు మాత్రం భయం పుట్టిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.56 పైసలు ఉండగా, డీజిల్ ధర రూ.75.54 పైసలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.84 ఉండగా, డీజిల్ ధర రూ.89.07గా ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు వందకు మించి అస్సలు తగ్గడం లేదు.