Drinking Blood : రక్తం తాగుతున్న యువతి.. ఇప్పటికే 3,785 లీటర్లు ఖతమ్!-woman addicted to drinking blood from childhood and she drunk 3785 liters till now ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drinking Blood : రక్తం తాగుతున్న యువతి.. ఇప్పటికే 3,785 లీటర్లు ఖతమ్!

Drinking Blood : రక్తం తాగుతున్న యువతి.. ఇప్పటికే 3,785 లీటర్లు ఖతమ్!

Anand Sai HT Telugu
Mar 31, 2024 12:45 PM IST

Drinking Blood In Telugu : కొంతమంది అలవాట్లు వింతగా ఉంటాయి. ఎవరికీ అంతు చిక్కవు. అలానే ఓ యువతి చాలా ఏళ్లుగా రక్తం తాగుతుంది.

రక్తం తాగుతున్న యువతి
రక్తం తాగుతున్న యువతి (Unsplash)

కొంతమంది ఎలాంటి డైట్‌ని అనుసరిస్తారో నమ్మడం కష్టం. ఆదిమానవులు గుహల్లో నివసించే కాలంలో పచ్చి మాంసం, రక్తం తీసుకునేవారు. కొందరు మనుషులను తినేవారని చదివాం. అలాగే నేటికీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వింత ఆహారాలు ఉన్నాయి.

కొన్ని చోట్ల వారు తినే ఆహారాన్ని చూసి షాక్ అవుతాం. ఎందుకంటే అవి జంతువులు, పక్షులు, పాములు, కప్పలు మొదలైన వాటిని తింటారు. అయితే మరికొన్ని చోట్ల ఆహారపు అలవాట్లు ఎంత విచిత్రంగా ఉంటాయో అక్కడి మనుషులు కూడా అంతే విచిత్రంగా ఉంటారు. అయితే ఇక్కడ ఓ మహిళ తాను పుట్టినప్పటి నుంచి పాలు తాగలేదని, రక్తం తాగుతున్నానని పేర్కొంది.

ఈ కథ వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఆమె పంది రక్తం తాగడానికి బానిస. రక్తం లేకుండా జీవితం కష్టమని ఆమె భావిస్తుంది. ఆమె 10 సంవత్సరాల వయస్సు నుండి పంది రక్తం తాగుతోంది. కాలిఫోర్నియాలోని లాంకాస్టర్‌కు చెందిన 29 ఏళ్ల మిచెల్ అనే మహిళ యుక్తవయస్సు నుండి పందుల రక్తాన్ని తీసుకుంటోంది. ఆమె ఇటీవల రక్తానికి బానిసనని ఒప్పుకుంది. రక్తం లేకుండా జీవించలేనని పేర్కొంది.

పంది రక్తం తాగడం వల్ల తనకు ఎనర్జీ వస్తుంది అని మిచెల్ షేర్ చేసింది. ఆమె రక్తాన్ని కొంచెం వేడి చేయకుండా నేరుగా తన గ్లాసులోకి తాగుతుంది. దీని తర్వాత ఆహారం తింటుంది. రక్తం తనకు ఎంత ముఖ్యమో, ప్రతి రోజూ ఉదయం దానిని కాఫీలో కలిపి తాగుతానని చెప్పింది. దీనితో పాటు చదువుతున్నప్పుడు, టీవీ చూస్తూ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీరు, రసం తాగినట్లు ఆమె రక్తం తాగుతుంది.

ఆమె చిన్నతనంలో డిప్రెషన్‌లో ఉండేది. ఈ డిప్రెషన్‌తో పోరాడుతున్న సమయంలో ఆమెకు పంది రక్తం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆమె 3,785 లీటర్ల రక్తం తాగింది. ఆమె రక్తం తాగడం వైన్ తాగడంతో పోల్చింది.

పంది రక్తం ఆమెకు జలుబు, దగ్గు వంటి చిన్న వ్యాధిని నయం చేసినట్లు అనిపించిందట. ఆమె రక్తం తాగినప్పుడు వేడిగా అనిపిస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన పదార్థాలు ఉంటాయని ఆమె చెబుతుంది. చిన్న చిన్న జబ్బులకు ఇది మంచి ఆప్షన్ అని ఆమె పేర్కొంది. ఆమె రక్తం తాగడాన్ని ఇష్టపడుతుంది. కానీ ప్రజలు ఆమెను పిశాచం అని పిలుస్తున్నారు. అందుకే

ఆమె ఒక పందుల పెంపకం చేసే ప్రదేశానికి వెళ్లి అక్కడ నుండి పంది రక్తాన్ని సేకరించినట్లుగా చెబుతుంది. ఆమె రక్తం అలానే తాగుతుంది. అయితే ఇప్పటి వరకు ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. రక్తం తాగడం ఆమె దినచర్య కాబట్టి, ఆమె రక్తం తాగే రోజు కూడా మానలేదు.

ఈ వార్తలో నిజం ఎంతో ఉందో తెలియదు కానీ.. ఆమె చెప్పిన విషయాలు మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి. కొందరు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. పంది రక్తం జీర్ణక్రియకు సెట్ కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వింత అలవాటు తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Whats_app_banner