Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ వ్యాపారంలో ప్రమేయం లేదన్న ఎంపీ మాగుంట…-ysrcp mp maagunta denies allegations of delhi liquor scam involvement ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ వ్యాపారంలో ప్రమేయం లేదన్న ఎంపీ మాగుంట…

Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ వ్యాపారంలో ప్రమేయం లేదన్న ఎంపీ మాగుంట…

B.S.Chandra HT Telugu
Sep 19, 2022 11:31 AM IST

Delhi liquor Scam ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో తన ప్రమేయం లేదని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట ఆగ్రో ఫార్మ్స్‌ సంస్థలో తనకు ఎలాంటి భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో దేశ వ్యాప్తంగా ఈడీ దర్యాప్తు వేగం పెరిగిన సమయంలో మాగుంట వివరణ ఇచ్చారు. రాజకీయంగా ఎదుర్కొలేక తన పేరును దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

లిక్కర్ స్కాం వ్యవహారంలో తన పాత్ర లేదంటున్న ఎంపీ మాగుంట
లిక్కర్ స్కాం వ్యవహారంలో తన పాత్ర లేదంటున్న ఎంపీ మాగుంట

Delhi liquor Scam ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. 50ఏళ్లుగా తమ కుటుంబం మద్యం వ్యాపారంలో ఉందని దక్షిణ భారతదేశమంతటా తాము వ్యాపారాలు నిర్వహిస్తున్నామని ఢిల్లీలో వ్యాపారాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి అనే వ్యక్తి ఈడీ దృష్టిలో లిక్కర్ వ్యాపారి మాత్రమేనని ఈడీ దర్యాప్తు దానికే పరిమితమని చెప్పారు. ఢిల్లీలో 32జోన్లలో మద్యం టెండర్లు నిర్వహిస్తే రెండు జోన్లలో మాత్రమే మాగుంట కుటుంబానికి చెందిన ఆగ్రో ఫార్మ్స్‌ సంస్థకు రెండు జోన్లలో మాత్రమే వ్యాపారాలు దక్కాయని ఆ సంస్థలో తాను, తన కుమారుడు డైరెక్టర్లు కాదని ఎంపీ మాగుంట చెప్పారు.

Delhi liquor Scam ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఆదివారం నుంచి దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. లిక్కర్‌ పాలసీ ఖరారులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే అభియోగాల నేపథ్యంలో హైదరబాద్‌లో కూడా ఈడీ దర్యాప్తు సాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు సోదాలు నిర్వహించిన ఈడీ బృందాలు ఆదివారం పిళ్లైను సుదీర్ఘంగా ప్రశ్నించారు. రాబిన్ డిస్ట్రిలరీస్ పేరుతో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న పిళ్లై ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నిందితుడిగా సిబిఐ పేర్కొంది. టిఆర్‌ఎస్‌ నాయకులతో పిళ్లైకు సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ప్రశ్నించడం కీలకంగా భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో రాజకీయ నాయకులకు సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యలో వైసీపీ ఎంపీ మాగుంట వివరణ ఇచ్చారు.

తన తండ్రి నుంచి వారసత్వంగా మద్యం వ్యాపారాలు చేస్తున్నామని ఎంపీ మాగుటం చెప్పారు. తమ రాజకీయ జీవితానికి ఎలాంటి అడ్డంకి లేదని, ప్రకాశం జిల్లాలో తమ రాజకీయాలు కొనసాగుతాయని,తన కొడుకు 2024లో ప్రకాశం జిల్లాలో పోటీ చేస్తాడని స్పష్టం చేశారు. తాను నాలుగు సార్లు ఎంపీగా గెలిచానని, చట్టాలకు లోబడి తాను వ్యాపారాలు చేస్తున్ననాని చెప్పారు. తమ కుటుంబంపై ఎలాంటి మచ్చ లేదని, ఏ తప్పు తాము చేయలేదన్నారు. ఢిల్లీ మద్యం సిండికేట్లలో తన ప్రమేయం లేదన్నారు.

తాము 8రాష్ట్రాల్లో 35ఏళ్లుగా Delhi liquor Scam మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏ రాష్ట్రంలో కూడా తమపై ఆరోపణలు రాలేదన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు తొలిసారి వెళ్లామని అక్కడ రాజకీయ కారణాలతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. ఆరోపణల నేపథ్యంలోనే వివరణ ఇస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయంగా తాను ఎప్పుడు ఎవరిని దుర్భాషలాడింది లేదన్నారు. ఢిల్లీలో 32 జోన్లలో మద్యం వ్యాపారాలు జరిగితే తమకు2 జోన్లలో మాత్రమే మద్యం వ్యాపార కాంట్రాక్టులు దక్కాయన్నారు.

మద్యం వ్యాపారంలోDelhi liquor Scam ఉన్న కుటుంబ సభ్యులకు మాగుంట ఇంటి పేరు ఉండటంతోనే అపోహలు ఏర్పడ్డాయన్నారు. ఢిల్లీలో వ్యాపారాలు చేసే వారందరిపై ఈడీ సోదాలు జరిగాయని, వారు అడిగిన ప్రశ్నలు అన్నింటికి తాము సమాధానాలు నివృత్తిచేశామని చెప్పారు. ఢిల్లీ లిక్కర్‌ బిజినెస్‌లో తాము డైరెక్టర్లుగా లేమని స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యులు ఉండటంతో తన పేరును తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. ఎంపీగా తాను ఎలాంటి వ్యాపార సంస్థల్లో డైరెక్టర్‌గా లేదని స్పష్టం చేశారు. మద్యం వ్యాపారాల నిర్వహణలో తమ ప్రమేయం ఏమి లేదని మాగుంట స్పష్టం చేశారు.

IPL_Entry_Point