East Godavari District : చెట్టు నుంచి నీటి ధార - షాక్ అయిన అటవీశాఖ సిబ్బంది, ఇదిగో వీడియో-water from a wild tree at papikonda national park in ap video gone viral on social media ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  East Godavari District : చెట్టు నుంచి నీటి ధార - షాక్ అయిన అటవీశాఖ సిబ్బంది, ఇదిగో వీడియో

East Godavari District : చెట్టు నుంచి నీటి ధార - షాక్ అయిన అటవీశాఖ సిబ్బంది, ఇదిగో వీడియో

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 31, 2024 08:50 AM IST

Water From Wild Tree in Andhrapradesh: అడవిలోని ఓ చెట్టు నుంచి నీటి ధార వచ్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను రంపచోడవరం అటవీ శాఖ అధికారులు వివరించారు.

చెట్టు నుంచి నీరు
చెట్టు నుంచి నీరు

Water From Nallamaddi Tree in Andhrapradesh: అటవీశాఖ సిబ్బంది, అధికారులు తనిఖీ కోసం వెళ్లారు. అడవిలోని చెట్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ చెట్టుకు బొడుపులు ఉండటాన్ని గమనించారు. వాటిపై కత్తితో గాటు పెట్టాలని పై అధికారి సూచించటంతో.... సిబ్బంది ఆ పని మొదలుపెట్టింది. ఇలా గాటు పెట్టగానే..... ఒక్కసారి నీటి ధార మొదలైంది. మొదలు చిన్నగా మొదలై.... ఒక్కసారిగా ధారలా బయటకు వచ్చింది. ఈ షాకింగ్.... ఘటన తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) పరిధిలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వివరాలు ఇవే…

అడవిలోని చెట్టు నుంచి నీరు వచ్చిన సంఘటన పాపికొండలు నేషనల్‌ పార్క్‌లోని ఇందుకూరు రేంజ్‌ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది. రంపచోడవరం అటవీశాఖ అధికారులు.... శనివారం తనిఖీలకు వెళ్లినప్పుడు ఈ చెట్టును గమనించారు. ఈ చెట్టును నల్లమద్ది చెట్టుగా పిలుస్తారని అధికారులు చెప్పారు. చెట్టుకు బొడుపులు ఉన్నచోట కత్తితో గాటు పెట్టగానే... నీటి ధార వచ్చిందని పేర్కొన్నారు.

అయితే నీళ్లు రావటపై అటవీశాఖ రేంజ్ అధికారులు పలు వివరాలను వెల్లడించారు. నల్లమద్ది చెట్టుకు నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని పేర్కొన్నారు. దీన్ని క్రోకోడైల్‌ బర్క్‌ ట్రీ అని పిలుస్తారని చెప్పారు. శాస్త్రీయ నామం టెర్మినేలియా టొమెంటోసా అని తెలిపారు. ఈ చెట్టు నుంచి దాదాపు 20 లీటర్ల నీరు వచ్చిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజికమాధ్యామాల్లో తెగ వైరల్ అవుతోంది.

Whats_app_banner