Tirumala Leopard: తిరుమలలో చిన్నారిని చంపిన చిరుతను గుర్తించిన అటవీశాఖ, శాస్త్రీయ పరీక్షల్లో నిర్దారణ…-the forest department identified the leopard that killed the child in tirumala scientific tests confirmed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Leopard: తిరుమలలో చిన్నారిని చంపిన చిరుతను గుర్తించిన అటవీశాఖ, శాస్త్రీయ పరీక్షల్లో నిర్దారణ…

Tirumala Leopard: తిరుమలలో చిన్నారిని చంపిన చిరుతను గుర్తించిన అటవీశాఖ, శాస్త్రీయ పరీక్షల్లో నిర్దారణ…

Sarath chandra.B HT Telugu
Mar 19, 2024 09:24 AM IST

Tirumala Leopard: తిరుమల నడక మార్గంలో గత ఏడాది చిన్నారి లక్షితను చంపేసిన చిరుతను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. శాస్త్రీయ పరీక్షల ద్వారా దాడి చేసిన చిరుతను గుర్తించినట్టు ప్రకటించారు

చిన్నారిని చంపిన చిరుతను గుర్తించిన అటవీ శాఖ
చిన్నారిని చంపిన చిరుతను గుర్తించిన అటవీ శాఖ

Tirumala Leopard: తిరుమల నడక మార్గంలో చిన్నారి Lakshitaపై దాడి చేసి చంపేసిన చిరుతను గుర్తించారు. గత ఏడాది ఆగష్టు -సెప్టెంబర్ మధ్య కాలంలో అటవీ శాఖ బంధించిన చిరుతల్లో దాడి చేసిన దానిని గుర్తించారు. గత ఏడాది మొత్తం ఆరు చిరుతల్ని టీటీడీ- అటవీశాఖ Forest బంధించాయి. నడక మార్గంలోని ఏడవ నంబరు మలుపు దగ్గర బోనులో చిక్కిన చిరుతల్లో ఒకదానిని బాలికపై దాడి చేసినట్టు నిర్ధారించారు. సెప్టెంబర్‌ 20వ తేదీన బంధించిన చిరుతే బాలికపై దాడి చేసినట్టు DNA పరీక్షల్లో నిర్ధారించారు.

బాలిక శరీరంపై గాయాలతో పాటు డిఎన్‌ఏ పరీక్షల ద్వారా దాడి చేసిన చిరుత ఏదని నిర్ధారణకు వచ్చారు. దీంతో బాలికపై దాడి చేసిన చిరుతను ఇకపై జూకు పరిమితం చేయనున్నారు. దానిని అటవీ శాఖ సంరక్షణలో ఉంచనున్నారు. వైద్య పరీక్షల్లో విఫలమైన వాటిని శేషాచలం, నంద్యాల అటవీ ప్రాంతాల్లో విడిచి పెట్టనున్నారు. గతంలో మూడు చిరుతల్ని విడిచి పెట్టేశారు. వాటిలో ఒకటి కూన కావడంతో మొదట్లోనే దానిని అడవిలో వదిలేశారు.

ఐదేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న చిరుత…

తిరుమల నడక మార్గంలో గత ఏడాది ఆగష్టు 11న ఐదేళ్ల చిన్నారిని చిరుత పొట్టన పెట్టుకుంది. అలిపిరి కాలినడక మార్గంలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో బాలిక మృతి చెందింది. రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి లక్షిత కుటుంబ సభ్యులు అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. కుటుంబ సభ్యులకు కాస్త ముందు నడుస్తున్న బాలికపై చిరుత దాడి చేసింది. మర్నాడు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

బాలికపై దాడి చేసి చంపేసిన తర్వాత శ్రీవారి భక్తుల భద్రతలో భాగంగా తిరుమల నడక దారిలో ప్రమాదకరంగా సంచరిస్తున్న చిరుతల్ని బంధించే ప్రక్రియ చేపట్టారు. నెల రోజుల వ్యవధిలో ఆరు చిరుతలను అటవీ శాఖ బంధించింది. చిన్నారి లక్షితపై దాడి తర్వాత ప్రారంభించిన ఆపరేషన్ చిరుతలో భాగంగా మెట్ల మార్గంలో సంచరిస్తున్న చిరుతల్ని బంధించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

దాదాపు నెల రోజుల పాటు సాగిన ఆపరేషన్‌ చిరుతలో మొత్తం ఆరింటిని బంధించాచు. చిన్నారి లక్షితపై దాడి జరిగిన ప్రాంతంలో సంచరిస్తున్న మరికొన్ని చిరుతలను కూడా ట్రాప్‌ కెమెరాల్లో గుర్తించారు. నడక మార్గాల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతల కదలికల్ని అధికారులు గుర్తించారు. దీంతో రాత్రిపూట నడక మార్గంలో వెళ్లే భక్తులపై ఆంక్షలు విధించారు. గుంపులుగా మాత్రమే

2023 ఆగష్టు 11న ఆరేళ్ల లక్షితపై చిరుత దాడి చేయడంతో చిరుతల్ని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ ఆపరేషన్ చిరుత ప్రారంభించారు.శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే తిరుమల మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయని గుర్తించారు.

2023 ఏడాది జూన్ 22న బాలుడు కౌశిక్‌పై మెట్ల మార్గంలో చిరుత దాడి చేసింది. దానిని చూసిన బంధువులు చిరుత వెంటపడటంతో 500మీటర్ల దూరంలో బాలుడిని వదిలేసి పారిపోయింది. గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత లక్షితపై దాడి చేసి చంపేసింది.

చిరుతల కట్టడికి చర్యలు…

తిరుమల నడక మార్గంలో చిరుతల సంచరాన్ని పలుమార్లు గుర్తించినా వాటిని పట్టుకునే ప్రయత్నాలు చేయలేదు. బాలుడిని నోట కరుచుకుని చిరుత వెళ్లడంతో దానిని పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేశారు. జూన్ 24న బోనులో చిక్కిన చిరుతను నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

ఆ తర్వాత నరసింహ స్వామి ఆలయం వద్ద ఆగష్టు 11న నెల్లూరు జిల్లాకు చెందిన లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. నడక మార్గంలో తిరుమల వెళుతున్న బాలికను దాడి చేసి చంపేయడంతో భక్తులు హడలెత్తిపోయారు. దీంతో టీటీడీ అప్రమత్తమై పెద్ద ఎత్తున దిద్దుబాటు చర్యలు చేపట్టారు. చిరుతల నుంచి భక్తులను కాపాడాలనే ఉద్దేశంతో వాటిని బంధించేందుకు చర్యలు చేపట్టారు.

నడక మార్గం వైపుకు వస్తున్న చిరుతల్ని బంధించాలని నిర్ణయించారు. చిరుతల్ని గుర్తించేందుకు వందలాది ట్రాప్‌ కెమెరాలు అమర్చారు.అటవీ శాఖ ప్రయత్నాలు ఫలించి ఆగష్టు 14న చిరుత చిక్కింది. అదే ప్రాంతంలో ట్రాప్‌ కెమెరాల్లో మరో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. నాలుగో చిరుత మాత్రం బోను వరకు రావడం వెనక్కి వెళ్లిపోతుండటంతో చిరుత కదలికల్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు.

చిరుతకు ఆహారం చిక్కకుండా అటవీ సిబ్బంది కట్టడి చేయడంతో అది విధిలేని పరిస్థితుల్లో బోనుకు దగ్గరగా వచ్చినట్లు చెబుతున్నారు. వందలాది సిబ్బంది ఇందుకోసం పనిచేసినట్లు అటవీ శాఖ చెబుతోంది. ఆగష్టు 28న నాలుగో చిరుత చిక్కింది. సెప్టెంబర్ 7వ తేదీన మరో చిరుతను అటవీ శాఖ సిబ్బంది బంధించారు. తాజాగా సెప్టెంబర్‌ 20వ తేదీన మరో చిరుత బోనులో చిక్కింది.

ఇలా నెలన్నర వ్యవధిలోనే ఆరు చిరుతల్ని బంధించారు. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతలు ఉన్నాయో లేదో నిర్ధారించనున్నారు. ఆగష్టులో పట్టుకున్న మూడు చిరుతల్ని ప్రస్తుతం ఎస్వీ జూలో సంరక్షణలో ఉంచారు. అటవీ శాఖ పట్టుకున్న చిరుతల్లో రెండు చిరుతల్ని అటవీ శాఖ విడిచిపెట్టింది. వీటిలో ఒకదానికి పూర్తి స్థాయిలో దంతాలు లేకపోవడం, డిఎన్‌ఏ పరీక్షల్లో అవి లక్షితపై దాడి చేయలేదని నిర్ధారణ కావడంతో వాటిని వదిలేశారు.

తాజాగా సెప్టెంబర్ 20వ తేదీన 7వ మలుపు వద్ద బోనులో బంధించిన చిరుత చిన్నారి లక్షితపై దాడి చేసినట్టు నిర్ధారించడంతో దానిని ఎస్వీ జూలోనే ఉంచనున్నారు. మిగిలిన వాటికి విముక్తి లభించనుంది.

 

Whats_app_banner

సంబంధిత కథనం