Vijayawada Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్, విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దు
Vijayawada Trains Cancelled : విజయవాడ డివిజన్ లో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 9 నుంచి 16 మధ్య పలు రైళ్లను పూర్తిగా, పాక్షికంగా రద్దు చేశారు.
Vijayawada Trains Cancelled : విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ డివిజన్లో నిర్వహణ పనులతో పాటు ట్రాఫిక్ బ్లాక్ పనుల దృష్ట్యా రేపటి(అక్టోబర్ 9) నుంచి ఈ నెల 16 వరకు పలు రైళ్లను పూర్తిగా, పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
పూర్తిగా రద్దైన రైళ్లు
- విజయవాడ-తెనాలి రైలు (07279) - అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 15 వరకు
- తెనాలి-విజయవాడ రైలు (07575) -అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 15 వరకు
- విజయవాడ- ఒంగోలు రైలు (07461) - అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 15 వరకు
- ఒంగోలు- విజయవాడ రైలు (07576) - అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 15 వరకు
- బిట్రగుంట-విజయవాడ రైలు (07977/07978) -అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 15 వరకు
- బిట్రగుంట - చెన్నై సెంట్రల్ రైలు (17237/17238)- అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 13 వరకు
- విజయవాడ- గూడూరు రైలు (17259/17260) - అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 15 వరకు
- విజయవాడ- గూడూరు రైలు (07500) - అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 15 వరకు
- గూడూరు- విజయవాడ రైలు (07458) - అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 16 వరకు
- రాజమండ్రి- విశాఖ రైలు (07466/07467) - అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 15 వరకు
- గుంటూరు- విశాఖ రైలు (17239/17240) - అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 16 వరకు
- విజయవాడ- విశాఖ రైలు (22701/22702) - అక్టోబర్ 9,10,11,13,14 తేదీల్లో రద్దు
- రాజమండ్రి- విజయవాడ రైలు (07767) - అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 15 వరకు
- విజయవాడ- రాజమండ్రి రైలు (07459) - అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 15 వరకు
- మచిలీపట్టణం- విశాఖపట్నం రైలు (17219/17220) - అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 16 వరకు
- విజయవాడ- గూడూరు (12743/12744) రైలును 11వ తేదీ నుంచి 16వరకు పూర్తిగా రద్దు
పాక్షికంగా రద్దైన రైళ్లు
విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు పాక్షికంగా రద్దైయ్యాయి. నర్సాపూర్-గుంటూరు రైలును (నెం. 17281/17282) అక్టోబర్ 9 నుంచి 15 వరకు విజయవాడ-గుంటూరు మధ్య రద్దు చేశారు. మచిలీపట్టణం-విజయవాడ రైలును (నెం.07896) అక్టోబర్ 9 నుంచి 15 వరకు విజయవాడ-రామవరప్పాడు మధ్య రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ- మచిలీపట్నం రైలు (నెం.07769), నర్సాపూర్- విజయవాడ రైలు (07883), విజయవాడ- మచిలీపట్టణం రైలు (07866), మచిలీపట్టణం-విజయవాడ రైలు (07770), విజయవాడ- భీమవరం జంక్షన్ రైలు(07283), మచిలీపట్టణం-విజయవాడ (07870), విజయవాడ- నర్సాపూర్ (07861) రైళ్లను అక్టోబర్ 9 నుంచి 15 మధ్య విజయవాడ రామవరప్పాడు మధ్య రద్దు చేశారు.
దారి మళ్లింపు
పలు రైళ్లను విజయవాడ, గుడివాడ మీదుగా భీమవరం వైపు దారి మళ్లించారు. అక్టోబర్ 9 నుంచి 13 వరకు ధన్బాద్- అలెప్పి(13351) రైలును, ఈ నెల 10న హతీయ- బెంగళూరు(12835) రైలును, ఈ నెల 13న టాటా- బెంగళూరు (12889) రైలును, ఈ నెల 12న టాటా- యశ్వంత్పూర్ (18111) రైలును, ఈ నెల 9న హతియ- ఎర్నాకుళం (22837) రైలును విజయవాడ, గుడివాడ, భీమవరం మీదుగా దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.