Facial Recognition in Tirumala : తిరుమలలో ఫేషియల్ రికగ్నిషన్.. ఆ కౌంటర్ ల వద్ద-ttd to introduce facial recognition in tirumala from march 1 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd To Introduce Facial Recognition In Tirumala From March 1

Facial Recognition in Tirumala : తిరుమలలో ఫేషియల్ రికగ్నిషన్.. ఆ కౌంటర్ ల వద్ద

HT Telugu Desk HT Telugu
Feb 28, 2023 06:22 PM IST

Facial Recognition in Tirumala : తిరుమలలో ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. గదుల కేటాయింపు.. కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

Facial Recognition in Tirumala : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో భక్తులకి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోన్న తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) .. మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు.. కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేయనుంది. బుధవారం (మార్చి 1) నుంచే ఈ విధానాన్ని ట్రైల్ ఫేజ్ లో ప్రారంభిస్తోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా బుధవారం నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.

తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు కౌంటర్లు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద ఈ పరిజ్ఞానం ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి లడ్డూలు జారీ చేస్తారు.

ఇన్ ఫెక్షన్ల పై క్షురకులకు అవగాహన

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల తలనీలాలు తీసే క్షురకులు.... ఇన్ఫెక్షన్లు (Infections) రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తిరుపతికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కృష్ణప్రశాంతి సూచించారు. తిరుమల ఆస్థాన మండపంలో మంగళవారం (ఫిబ్రవరి 28) కళ్యాణకట్ట క్షురకులకు ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణప్రశాంతి మాట్లాడుతూ క్షురకులు భక్తులకు చాలా దగ్గరగా ఉండి సేవలందిస్తారని... కావున మాస్కులు ధరించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రధానంగా ఊపిరితిత్తులు, వెంట్రుకలు, ముక్కు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని నివారించేందుకు లోషన్ తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని, చేతులకు తడి లేకుండా చూసుకోవాలని సూచించారు.

ఎక్కువసేపు కూర్చొని పని చేయాల్సి రావడం వల్ల మోకాలి నొప్పి, నడుము నొప్పి రాకుండా గంటకోసారి ఐదు నిమిషాలు లేచి నడవాలని డాక్టర్ ప్రశాంతి సూచించారు. విధులు ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ మెడ, భుజాలకు సంబంధించిన వ్యాయామం చేయాలని చెప్పారు. అనంతరం పలువురు క్షురకులు అడిగిన అనారోగ్య సమస్యలకు పరిష్కారాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ రమాకాంతరావు, 300 మందికి పైగా కళ్యాణకట్ట క్షురకులు పాల్గొన్నారు.

IPL_Entry_Point