Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు - ఈనెల 19న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం-ttd is organising koil alwar tirumanjanam traditional temple cleansing fete at srivari temple on december 19 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు - ఈనెల 19న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు - ఈనెల 19న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 07, 2023 06:12 PM IST

Tirumala Vaikunthadwara Darshan : డిసెంబరు 19వ తేదీన తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది.

వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నం
వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నం

Tirumala Vaikunthadwara Darshan : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలు ఉండన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 19వ తేదీ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

డిసెంబరు 19న‌ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక8 పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది.

IPL_Entry_Point