Tirumala Brahmotsavam : అక్టోబర్ 4 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు- వాహనసేవల షెడ్యూల్ విడుదల-tirumala salakatla brahmotsavam october 4 to 12 schedule released ttd vahana seva details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Brahmotsavam : అక్టోబర్ 4 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు- వాహనసేవల షెడ్యూల్ విడుదల

Tirumala Brahmotsavam : అక్టోబర్ 4 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు- వాహనసేవల షెడ్యూల్ విడుదల

HT Telugu Desk HT Telugu
Aug 19, 2024 08:20 PM IST

Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య వాహన సేవలు నిర్వహించనున్నారు.

అక్టోబర్ 4 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు- వాహనసేవల షెడ్యూల్ విడుదల
అక్టోబర్ 4 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు- వాహనసేవల షెడ్యూల్ విడుదల

Tirumala Brahmotsavam : తిరుమలలో ప్రతి రోజూ పండుగే. టీటీడీ ఏడాది పొడవునా 450 ఉత్సవాలు నిర్వహిస్తుంది. వివిధ పండుగలలో అతి ముఖ్యమైనది నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు. తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరుగుతాయి. తిరుమలలో అక్టోబర్ 3న అంకురార్పణతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.

ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య (అక్టోబర్ 4 మినహా) వాహన సేవలు ఉంటాయి. రోజు వారీగా ఉదయం, సాయంత్రం వాహన సేవల షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది.

  • అక్టోబర్ 4 : శుక్రవారం సాయంత్రం 5:45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధ్వజారోహణం ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం ఉంటుంది.
  • అక్టోబర్ 5 : శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు చిన్నశేష వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హంస వాహన సేవ నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 6 : ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు సింహ వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ముత్యపుపందిరిలో స్వామివారు విహరిస్తారు.
  • అక్టోబర్ 7 : సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు కల్పవృక్షం సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వ భూపాల సేవ నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 8 : మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహన సేవ ఉంటుంది.
  • అక్టోబర్ 9: బుధవారం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గజవాహన సేవ నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 10 : గురువారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది.
  • అక్టోబర్ 11 : శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రథోత్సవం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహన సేవ ఉంటుంది.
  • అక్టోబర్ 12 : శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండు, మూడు, నాల్గో రోజుల్లో రంగనాయకుల మండపంలో శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం