Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, నవంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ విడుదల-tirumala darshan srivari arjitha seva tickets novermber quota shedule released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, నవంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ విడుదల

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, నవంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Aug 13, 2024 06:35 PM IST

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు నవంబర్ కోటాను ఆగస్టు 19న విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 21న ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని భక్తులతు టీటీడీ సూచించింది. నవంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ ను టీటీడీ విడుదల చేసింది.

 తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, నవంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, నవంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ విడుదల

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నవంబర్ నెల కోటా షెడ్యూల్ ను టీటీడీ విడుదల చేసింది. ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 21న ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని భక్తులతు టీటీడీ సూచించింది. టికెట్లు పొందిన భక్తులు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది. వారికి లక్కీ డిప్ లో టికెట్లు జారీ చేస్తారు.

తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను, నవంబరు 9న నిర్వహించే పుష్పయాగం సేవా టికెట్లను ఆగస్టు 22న ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగస్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

నవంబర్ కోటా టికెట్లు

నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్ల కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగస్టు 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను ఆగస్టు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నవంబర్ కోటాను ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఆగస్టు 24న గదుల కోటా విడుదల

తిరుమల, తిరుపతిల‌లో నవంబర్ నెల గదుల కోటాను ఆగస్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఆగస్టు 27న తిరుమ‌ల, తిరుప‌తి శ్రీవారి సేవ కోటా టికెట్లు ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. దర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.

ఆగస్టు 18న శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం రద్దు

తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 18న శ్రీవారి కల్యాణోత్సవంను టీటీడీ రద్దు చేసింది. ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17వ తేది రాత్రి వరకు జరగనున్నాయి. ఈ కారణంగా 18వ తేదీ కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతిలోని ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి రాజగోపాల్ మంగళవారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఇవాళ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సంబంధిత కథనం