Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో రాకపోకలపై ఆంక్షలు, ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమల్లో
- Tirumala Ghat Road Restrictions : తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలపై టీటీడీ ఆంక్షలు విధించింది. రాత్రి వేళలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.

(1 / 6)
తిరుమల ఘాట్ రోడ్డులో వాహన ప్రయాణాలపై టీటీడీ ఆంక్షలు విధించింది. రాత్రి వేళలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.
(2 / 6)
శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.
(3 / 6)
ప్రతి రోజు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తిరుమల రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.
(4 / 6)
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జంతువుల బ్రీడింగ్ సమయం కావడం, భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.
(5 / 6)
తిరుమలలో గత రెండు నెలల నుంచి చిరుతలు కలకలం రేపుతున్నాయి. రాత్రి వేళల్లో ఘాట్ రోడ్డుల్లో చిరుతలు వాహనదారులకు కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 54వ క్రాస్ వద్ద చిరుత కనిపించిందని భక్తులు తెలిపారు.
ఇతర గ్యాలరీలు