Telangana Tourism : అతి తక్కువ ధరలోనే 'తిరుమల' ట్రిప్... ఉచితంగా శ్రీవారి శీఘ్రదర్శనం - ఈ టూర్ ప్యాకేజీ చూడండి..!
Telangana Tourism Tirumala Tour : తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్లాన్ ఉందా..? అయితే కేవలం ఒకే రోజులో వెళ్లి వచ్చేందుకు వీలుగా తెలంగాణ టూరిజం అదిరిపోయే టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. బుకింగ్ ప్రక్రియ, ధరలు, షెడ్యూల్ వివరాలను పూర్తి కథనంలో చూడండి….
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. ప్రైవేటు వాహనాలు ఉన్నవారి విషయం పక్కనపెడితే… ఇతర మార్గాల ద్వారా వెళ్లే వారు ముందస్తుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పక్కా ప్లాన్ ఉండాలి. పైగా దర్శనం కూడా గంటల సమయం వేచి చూడాలి.
ఇవన్నీ పక్కనపెడితే… భక్తుల కోసం తెలంగాణ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. తిరుమలకు తీసుకెళ్లటంతో పాటు దర్శనం కూడా చేయిస్తుంది. ఇదంతా కూడా ఒక్క ప్యాకేజీలోనే పొందుతారు. పైగా తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే కేవలం ఒక్క రోజులోనే తిరుమలకు వెళ్లి హైదరాబాద్ కు వచ్చేయవచ్చు..! https://tourism.telangana.gov.in/home వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ముఖ్య వివరాలు :
- ‘TIRUPATI - TIRUMALA TOUR’ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
- హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ఉంటుంది.
- కేవలం ఒకే ఒక్క రోజులోనే తిరుపతి, తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి.
- డే 1 : సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9848540374) సాయత్రం 06. 15 గంటలకు బేగంపేట్ టూరిజం ప్లాజాకు చేరుకుంటుంది.
- డే 2 : ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. నాన్ ఏసీ రూమ్ లో స్టే చేస్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత…. స్థానికంగా ఉన్న పలు ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని… సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు రిటర్న్ జర్నీ ప్రారంభవుతుంది.
- డే - ఉదయం 7 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
- తెలంగాణ టూరిజం బస్సు ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాలి. సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్లు కోసం రిపోర్ట్ చేస్తే టీటీడీ అధికారులు తిరస్కరిస్తారు. మీ డబ్బులు వాపస్ కూడా ఇవ్వబడవు.
టికెట్ ధరలు, లింక్
హైదరాబాద్ తిరుమల టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 3,700గా ఉంది. ఇక చిన్నారులకు రూ. 2,960గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. https://tourism.telangana.gov.in/package/tirupatitirumalatour ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేస్తే ఈ ప్యాకేజీ వివరాలు ఓపెన్ అవుతాయి.