Dindi Resorts Package : కోనసీమ కేరళ దిండి అందాలు చూసొద్దామా?-ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!-ap tourism konaseema dindi resorts two days tour package boating mada forest visit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dindi Resorts Package : కోనసీమ కేరళ దిండి అందాలు చూసొద్దామా?-ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

Dindi Resorts Package : కోనసీమ కేరళ దిండి అందాలు చూసొద్దామా?-ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

Bandaru Satyaprasad HT Telugu
May 06, 2024 01:29 PM IST

Dindi Resorts Package : కోనసీమ బ్యాక్ వాటర్స్ లోని దిండి రిసార్ట్స్, బోటింగ్ ఏపీలో ఒక్కసారైనా చూడదగిన ప్రదేశాలు. ఏపీ టూరిజం దిండి రిసార్ట్స్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

కోనసీమ కేరళ దిండి అందాలు చూసొద్దామా?
కోనసీమ కేరళ దిండి అందాలు చూసొద్దామా?

Dindi Resorts Package : కేరళను తలపించేలా కోనసీమ దిండి(Konaseema Dindi Resorts) ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఏపీ టూరిజం దిండి రిసార్ట్స్ కు వన్ డే, టూ డేస్ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. కోనసీమ గోదావరి నది(Godavari)లో 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుందరమైన ద్వీపాలు దిండి రిసార్ట్స్. గోదావరి నదిలో విహారం, దిండి రిసార్ట్స్ లో గడపడం ఓ అద్భుత అనుభవం. క్రూయిజ్‌లో రాత్రిపూట బస, రుచికరమైన ఆహారం మీ మనసు ఓ కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

టూర్ షెడ్యూల్(Dindi Tour Schedule):

  • డే 1 : పర్యాటకులు రాజమండ్రి (80 కి.మీ) లేదా పాలకొల్లు (20 కి.మీ) చేరుకున్నప్పుడు వారిని రోడ్డు మార్గంలో కోనసీమలోని దిండి గ్రామానికి(Dindi Village) తీసుకెళ్తారు. ఉదయం 10 గంటలకు రిసార్ట్‌లలోకి ప్రవేశిస్తారు. ఫ్రెషప్, అల్పాహారం చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. కోనసీమ బ్యాక్ వాటర్స్ గోదావరి ఉపనది వశిష్ట నదిలో బోటింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు.

నదిలో బోటింగ్(Godavari Cruise) చేస్తున్నప్పుడు, మీరు దట్టమైన కొబ్బరి తోటలు, చిన్న చిన్న ద్వీపాలు చూడవచ్చు. కోనసీమ బ్యాక్ వాటర్స్(Konaseema Back Waters), అద్భుతమైన అందాలను ఆస్వాదించవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత అంతర్వేదికి (Antarvedi)(25 కి.మీ రోడ్డు మార్గంలో) తీసుకెళ్తారు. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు. ఆలయం, బీచ్, బంగాళాఖాతంలో వశిష్ట నది(Vasishta River) సంగమ ప్రదేశం(సాగర సంగమం) చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. రాత్రి బసకు రిసార్ట్స్ తిరిగి వెళ్తారు.

  • డే 2 : మడ అడవుల్లో బోటింగ్(Mada Forest Boating) - రిసార్ట్‌ నుంచి చెక్ అవుట్ చేసి యానాం(Yanam) (50 కి.మీ.లు రోడ్డు మార్గంలో) వెళ్తారు. అక్కడ సెంట్రల్ ఏసీ బోట్‌ను ప్రయాణం ఉంటుంది. బోట్‌లో బ్రేక్ ఫాస్ట్, మధ్యా్హ్నం భోజనం అందిస్తారు. బోట్ ప్రయాణంలో మీరు కోనసీమ అద్భుతమైన అందాలను ఆస్వాదించవచ్చు. కొబ్బరి తోటలు, గోదావరి దీవులు, మడ అడవుల అద్భుతమైన అందాలు ఎంతో మనోహరం ఉంటాయి. సాగర సంగమాన్ని కూడా వీక్షించవచ్చు. ఒక ద్వీపంలో గంట గడిపి, బీచ్, సరస్సును సందర్శిస్తారు. ఆపై యానాంకు తిరిగి వెళ్తారు. సాయంత్రం 5 , 6 గంటల మధ్య యానాం చేరుకుంటారు. పిక్ అప్ వాహనంలో కాకినాడలో డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ కు రాత్రి 9 గంటలకు చేరుకుంటారు.

ప్యాకేజీలో ఉండేవి(Dindi Resort Package)

  • ఏపీ టూరిజం(AP Tourism) దిండి రిసార్ట్స్‌లో వసతి లేదా కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ట్రాన్స్‌పోర్టేషన్‌తో ఒక రాత్రి.(ఇండికా AC - 4, టవెరా/క్వాలీస్ AC -7 Pax, టెంపో ట్రావెలర్ AC - 12 నుంచి 14 , వింగర్ పాక్స్ AC, మినీ 12 బస్ AC - 12 - 15 మందికి).
  • డ్రైవర్ బేటాతో సహా టోల్ పన్ను, పార్కింగ్ రుసుము మినహాయింపు ఉంటుంది.
  • ఇద్దరు వ్యక్తులకు ఉచితంగా స్విమ్మింగ్ పూల్(Swimming Pool) యాక్సెస్, వసతి సదుపాయం(షరతులకు లోబడి)
  • నాన్ ఏసీ బోట్/ ఏసీ బోట్ షేరింగ్ టికెట్లు (బ్రేక్ ఫాస్ట్, బోట్‌లో వెజ్-లంచ్)
  • మడ ఫారెస్ట్(Mada Forest) బోట్ షేరింగ్ టికెట్లు (కనీసం 45 మందికి) అక్కడ బ్రేక్ ఫాస్ట్, వెజ్ లంచ్, టీ స్నాక్స్

దిండి రిసార్ట్స్, బోటింగ్ బుక్కింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం