Escape From ACB: ఏసీబీ దాడిలో దొరికిన తర్వాత పారిపోయిన సబ్‌ రిజిస్ట్రార్‌-the sub registrar who escaped from the police after being found in an acb raid ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Escape From Acb: ఏసీబీ దాడిలో దొరికిన తర్వాత పారిపోయిన సబ్‌ రిజిస్ట్రార్‌

Escape From ACB: ఏసీబీ దాడిలో దొరికిన తర్వాత పారిపోయిన సబ్‌ రిజిస్ట్రార్‌

Sarath chandra.B HT Telugu
Nov 24, 2023 11:02 AM IST

Escape From ACB: సత్యసాయి జిల్లాలో వింత ఘటన జరిగింది. ఏసీబీ దాడిలో నగదుతో పట్టుబడిన సబ్‌ రిజిస్ట్రార్‌ పోలీసుల కళ్లు గప్పి పారిపోవడం సంచలనం సృష్టించింది.

ఏసీబీ ట్రాప్‌లో చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్
ఏసీబీ ట్రాప్‌లో చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్

Escape From ACB: లంచం తీసుకుంటూ పట్టుబడిన సత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ పోలీసుల కళ్లు గప్పి పారిపోవడం సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి బుక్కపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎసిబి సోదాలు నిర్వహించింది.

సురేంద్ర రెడ్డి, రామ్ నాథ్ రెడ్డిల ఫిర్యాదు మేరకు డాక్యుమెంట్ రైటర్ శ్రీహరి ద్వారా 10వేల రూపాయలు నగదు తీసుకుంటూ సబ్ రిజిస్టర్ శీనునాయక్ దొరికిపోయారు. ఏసీబీ దాడుల తర్వాత అర్ధరాత్రి వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

పుట్టపర్తి మండలం కప్పల బండ గ్రామానికి చెందిన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడ్డారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్ శీను నాయక్‌.. ఏసీబీ అధికారుల కళ్లు గప్పి పరారయ్యాడు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం డాక్యుమెంట్ రైటర్ శ్రీహరి రూ. 10 వేలు లంచం తీసుకుని సబ్ రిజి స్టార్ శ్రీనివాసులు నాయక్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికా రులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రి 10:30 సమ యంలో అధికారులు కేసు నమోదు చేస్తుండగా శ్రీనివాసులునాయక్ మూత్రవిసర్జనకు వెళ్లాలంటూ బయటకు వెళ్లి బైక్‌పై తప్పించుకుని పరారయ్యాడు.

దీంతో సబ్ రిజిస్ట్రార్‌తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లపై ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. రాత్రి 10:43కు ద్విచక్ర వాహసంపై పారిపోతున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమె రాల్లో నమోదయ్యాయి. దీంతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సబ్‌ రిజిస్ట్రార్ కోసం గాలిస్తున్నారు.

సబ్ రిజిస్ట్రార్‌ పరారైన తర్వాత గురువారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు పుట్టపర్తిలో సబ్‌ రిజిస్ట్రార్ శ్రీనివాసులు నాయక్‌ ఇంటిలో, హిందూపురంలోని ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, కొంత నగదు స్వాధీనం చేసుకు న్నారు. కుటుంబసభ్యుల ఫోన్ నంబర్లను సేకరించి, వారి సంభాషణల ఆధారంగా సబ్‌ రిజిస్ట్రార్‌తో మాట్లాడిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

శ్రీనివాసులు నాయక్ రాత్రి 10.30 వరకు ఏసీబీ అధికారుల అదుపులోనే ఉన్నారు. డాక్యుమెంట్లు పరిశీలిస్తుండగా రెప్పపాటులో మాయమైనట్టు గుర్తించారు. దాడుల సమయంలో మొత్తం పది మంది సిబ్బంది ఉన్నారు. వారి సహకారంతోనే తప్పించుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఏసీబీ సిబ్బంది ప్రమేయంపై విచారణ జరుపుతున్నారు.

Whats_app_banner